E-Paper
Advertisement

Red Dead Redemption Free: రెడ్ డెడ్ రిడెంషన్ మొబైల్ వెర్షన్‌ లాంచ్.. ఆ యూజర్లకు ఉచితంగా పాపులర్ వీడియో గేమ్

Red Dead Redemption Free: రెడ్ డెడ్ రిడెంషన్ మొబైల్ వెర్షన్‌ లాంచ్.. ఆ యూజర్లకు ఉచితంగా పాపులర్ వీడియో గేమ్
Advertisement

Red Dead Redemption Mobile Version | ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వెస్టర్న్ వీడియో గేమ్ ‘రెడ్ డెడ్ రిడంప్షన్’ మొబైల్ వెర్షన్ విడుదల అయింది. అమెరికాకు చెందిన రాక్‌స్టార్ శాన్ డియాగో గేమ్స్ రెడ్ డెడ్ రిడంప్షన్ గేమ్ ని రూపొందించింది. తొలిసారిగా ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఈ గేమ్‌ కొత్త వెర్షన్ తాజాగా రిలీజ్ చేసింది. మరో విశేషం ఏమిటంటే నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం ఉన్నవారు ఈ గేమ్‌ను ఉచితంగా ఆడుకోవచ్చు.

రెడ్ డెడ్ రిడెంషన్ గేమ్‌లో ఆసక్తికర కథ

గేమ్ ప్రధాన పాత్ర జాన్ మార్స్టన్. తన పాత గ్యాంగ్ స్నేహితులను వెతుక్కుంటూ అమెరికా పశ్చిమ ప్రాంతాల్లో, మెక్సికోలో ప్రయాణం చేస్తాడు. రెడ్ డెడ్ రిడంప్షన్ 2 కథ ముగిసిన తర్వాత నుంచి ఈ కథ కొనసాగుతుంది. దీనికి తోడు కథలో మరో ప్లాట్ కూడా ఉంది. ‘అన్‌డెడ్ నైట్‌మేర్’ అనే జాంబీ స్టోరీ కూడా పారెలెల్ గా నడుస్తూ ఉంటుంది. కన్సోల్‌లో ఆఫ్ ది ఇయర్ ఎడిషన్ లాగానే పూర్తి కంటెంట్ మొబైల్‌ వెర్షన్‌ లో కూడా లభిస్తుంది.

మొబైల్‌లో గేమ్ ఆడటం ఎలా ఉంటుంది?

Advertisement

ఫోన్‌లో టచ్ స్క్రీన్ కంట్రోల్స్ చాలా సులభంగా, సౌకర్యంగా ఉంటాయి. మంచి ఫోన్లలో ఎక్కువ స్పీడ్ కోసం ప్రత్యేక పర్ఫామెన్స్ మోడ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ యాప్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో కూడా ఆడుకోవచ్చు పైగా ఇంటర్నెట్ అవసరం కూడా ఉండదు.

ఉచితంగా ఎలా ఆడాలి?

నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం ఉంటే చాలు! నెట్‌ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేసి ‘గేమ్స్’ సెక్షన్‌లో వెళ్లి రెడ్ డెడ్ రిడంప్షన్ డౌన్‌లోడ్ చేసుకోండి. అంతే ఫుల్ గేమ్ మీ ఫోన్‌లో వచ్చేస్తుంది.

కన్సోల్ ప్లేయర్స్‌కి కూడా గుడ్ న్యూస్

Advertisement

అవును! ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X|S, రాబోయే నింటెండో స్విచ్ 2 లలో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ వచ్చింది. పాత PS4, Xbox One, స్విచ్‌లో గేమ్ కొన్నవాళ్లు ఉచితంగానే కొత్త వెర్షన్ పొందవచ్చు.

కొత్త కన్సోల్స్‌లో ప్రత్యేకతలు ఏంటి?

పిఎస్‌5, Xbox సిరీస్ X|S లలో 60 FPS, 4K రిజల్యూషన్, HDR సపోర్ట్ ఉంటాయి. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. నింటెండో స్విచ్ 2 లో DLSS టెక్నాలజీ ఉపయోగించి మరింత మెరుగైన ఇమేజెస్ వస్తాయి.

సేవ్ చేసిన పాత ఫైల్స్ ఏమవుతాయి?

పాత కన్సోల్‌లో ఆడిన సేవ్ ఫైల్స్‌ను కొత్త పిఎస్‌5, Xbox Series X|S, స్విచ్ 2 కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మళ్లీ మొదటి నుంచి ఆడాల్సిన అవసరం లేదు.

Also Read: ఇంటర్నెట్‌ ఓనర్ ఎవరు?.. ఒకే కంపెనీ చేతిలో పవర్

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×