E-Paper
Advertisement

ఆఫర్ అంటే ఇదే.. రూ.17వేలకే 40 ఇంచుల టీవీ బాస్..

ఆఫర్ అంటే ఇదే.. రూ.17వేలకే 40 ఇంచుల టీవీ బాస్..
Advertisement

Realme TechLife 40 inch QLED smart TV: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. కేబుల్ టీవీల కాలం పోయి, స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. ఇంట్లోనే థియేటర్ లాంటి విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే.. వారి కోసం కంపెనీలు రోజుకో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నాయి.ఈ కోవకే చెందిన ప్రముఖ బ్రాండ్ రియల్‌మీ, బడ్జెట్ ధరలో క్యూఎల్ఈడీ టెక్నాలజీతో మార్కెట్‌ను షేక్ చేయడానికి ఒక అద్భుతమైన టీవీని లాంచ్ చేసింది. అదే.. realme TechLife 40 inch QLED Full HD Smart Google TV. ఈ ట్రెండింగ్ టీవీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Realme TechLife 40 inch TV పూర్తి ఫీచర్లు:

1.డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే అనే చెప్పాలి. ఈ బడ్జెట్‌లో క్యూఎల్ఈడీ స్క్రీన్ లభించడం నిజంగా మ్యూజిక్ , మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్. సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే.. క్యూఎల్ఈడీ టెక్నాలజీ వల్ల కలర్స్ చాలా రిచ్‌గా, బ్రైట్‌గా , షార్ప్‌గా కనిపిస్తాయి. దీని ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ వీడియోలను అత్యంత స్పష్టంగా చూపిస్తుంది. ఇక దీని బెజెల్-లెస్ డిజైన్ టీవీకి మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అంతే కాకుండా ఇది మీ హాల్ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

2.గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్:

Advertisement

ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉండటం వల్ల.. మీ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి మిర్రర్ చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీని వల్ల కేవలం మీ గొంతుతోనే టీవీని కంట్రోల్ చేయవచ్చు.

3.సౌండ్ , స్పీకర్ పర్ఫార్మెన్స్ :

ఒక మంచి టీవీకి పిక్చర్ క్వాలిటీ ఎంత ముఖ్యమో.. సౌండ్ కూడా అంతే ముఖ్యం. రియల్‌మీ ఈ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో పవర్ ఫుల్ స్పీకర్లను అమర్చారు. డాల్బీ ఆడియో లేదా అడ్వాన్స్‌డ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. ప్రత్యేకంగా హోమ్ పార్టీలు లేదా సినిమా నైట్స్‌కి ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

Advertisement

Also Read: మార్కెట్‌ను షేక్ చేస్తున్న..IFB వాషింగ్ మెషీన్! ధర కూడా చాలా తక్కువ

4.కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు :

ఈ స్మార్ట్ టీవీలో కనెక్టివిటీ కోసం అన్ని రకాల పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా పెన్ డ్రైవ్‌లను కనెక్ట్ చేయడానికి.. స్పెషల్ పోర్ట్స్ ఇచ్చారు. అలాగే వైర్‌లెస్ కనెక్షన్ కోసం స్ట్రాంగ్ వై-ఫై , బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నాయి.

5.ధర:

అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ప్రీమియం క్యూఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తున్న ఈ మోడల్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 17,999 మాత్రమే. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే.. వారికి ఇది ప్రస్తుతం బెస్ట్ ఛాయిస్. మీరు దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా రిటైల్ స్టోర్లలో కూడా దీనిని కొనొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×