E-Paper
Advertisement

చిట్టీల పేరిట భారీ మోసం.. అమీన్‌పూర్‌లో రూ.2 కోట్లతో రాత్రికి రాత్రే దంపతులు పరార్!

చిట్టీల పేరిట భారీ మోసం.. అమీన్‌పూర్‌లో రూ.2 కోట్లతో రాత్రికి రాత్రే దంపతులు పరార్!
Advertisement

Chit Fraud: పరిచయం ఉన్నవారే కదా అని నమ్మి చిట్టీల రూపంలో కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకున్నారు. చివరికి కోట్లతో పరారై ఊహించని షాక్ ఇచ్చారు ఓ దంపతులు. రూ. 2 కోట్లతో పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అమీన్‌పూర్ పరిధిలోని బీఎస్‌ఆర్ కాలనీలో శిరీష, సాంబశివరావు అనే దంపతులు నివాసముంటున్నారు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. పలువురి వద్ద నుంచి చిట్టీల పేరిట భారీగా డబ్బులు వసూలు చేశారు. నెలనెలా క్రమం తప్పకుండా వాయిదాలు కట్టించుకున్నారు. తీరా చిట్టీల గడువు ముగిసిన తర్వాత బాధితులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.

Advertisement

డబ్బుల కోసం బాధితుల నుంచి ఒత్తిడి ఎక్కువ అయ్యింది. దాంతో ఆ దంపతులు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవరికీ కనిపించకుండా పరారయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అమీన్‌పూర్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారైన దంపతులను ముమ్మారం గాలిస్తున్నారు.

Also Read: గ్యాస్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. కాపాడిన 108 సిబ్బంది!

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×