E-Paper
Advertisement

Realme P4 Lite: రూ.12,999కే రియల్‌మీ P4 లైట్ 5G బడ్జెట్ ఫోన్.. రూ.1500 లాంచింగ్ ఆఫర్ కూడా!

Realme P4 Lite: రూ.12,999కే రియల్‌మీ P4 లైట్ 5G బడ్జెట్ ఫోన్.. రూ.1500 లాంచింగ్ ఆఫర్ కూడా!
Advertisement

Realme P4 Lite: రియల్‌మీ పీ4 లైట్ 5జీ గురువారం భారత్ మార్కెట్ విడుదలైంది. పీ4 లైనప్‌లో ఇప్పటికే పీ4, పీ4 ఎక్స్, పీ4 ప్రో 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్‌తో పనిచేయనుంది. ఫోన్ హీట్ ను తగ్గించడానికి ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ కూడా ఉంది. దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ కోసం IP64 రేటింగ్‌ ఉంది.

వేరియంట్ల ధరలు

భారత్ లో రియల్‌మీ P4 లైట్ 5G ధర 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ గల బేస్ వేరియంట్ ధర రూ. 12,999 నుండి ప్రారంభమవుతుంది. అదే 4GB + 128GB, 6GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ హ్యాండ్ సెట్ ధరలు వరుసగా రూ. 13,999, రూ. 15,999గా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ మొజాయిక్ బ్లూ, మొజాయిక్ గ్రీన్ రంగులలో లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల సేల్స్ స్టార్ అయ్యాయి. లాంచింగ్ ఆఫర్ లో భాగంగా ఫ్లాట్ రూ. 1,000 తగ్గింపు, రూ. 500 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. రియల్‌మీ కస్టమర్లు అయితే రూ. 500 ఎక్స్ఛేంజ్ బోనస్‌కు కు అర్హులు అవుతారు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Advertisement

రియల్ మీ పీ4 లైట్ 5జీ డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ యూఐ 7.0 పై పనిచేస్తుంది. దీనికి రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.8-అంగుళాల HD LCD స్క్రీన్ ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్స్ ఉన్నాయి. హీట్ కంట్రోల్ కోసం ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్‌ ఉంది.

ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. 13 MP రియర్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రియల్‌మీ హ్యాండ్‌సెట్‌లో 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 7,000mAh బ్యాటరీతో పాటు 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది.

Advertisement

Also Read:  9000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో పోకో కొత్త ఫోన్స్ లాంచ్.. పవర్‌ఫుల్ కెమెరాతో ధర ఎంతంటే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×