E-Paper
Advertisement

Ustaad Bhagat Singh OTT: పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..ఎప్పుడంటే?

Ustaad Bhagat Singh OTT: పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..ఎప్పుడంటే?
Advertisement

Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ నటన ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.

నెట్ ఫ్లిక్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రీమింగ్..

ఉగాది పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అత్యంత భారీ ధరలకు ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తరువాతనే ఓటీటీలోకి వచ్చే విధంగా నిర్మాతలతో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇక ఈ విషయాన్ని స్వయంగా మైత్రి నిర్మాతలు కూడా తెలియజేశారు.

ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలోకి…

Advertisement

ఇక ఈ సినిమా మార్చి 19వ తేదీ థియేటర్లలో ప్రసారం కాగా ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ అధికారక ప్రకటన చేయనుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే ఇందులో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించే సందడి చేశారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన రెండో సినిమా కావటం విశేషం వీరిద్దరి కాంబోలో ఇదివరకే గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ సినిమాపై ధురంధర్ ప్రభావం?

Advertisement

గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీసు క్యారెక్టర్ లో అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికైతే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది వీకెండ్ వచ్చేసరికి కలెక్షన్ల పై ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా కూడా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ సినిమాపై కూడా కొంతమేర ప్రభావం చూపుతోందని చెప్పాలి. మరి ఈ పోటీని తట్టుకొని పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ బాటలో పయనించనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Tollywood Actress: ఈ ఫోటోలో అమాయకంగా ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా?ఇప్పుడు స్టార్ హీరోయిన్ తెలుసా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×