E-Paper
Advertisement

Realme Neo 8 infinite edition: ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌గా మార్కెట్‌లోకి కొత్త సరుకు.. శాంసంగ్ AMOLED డిస్‌ప్లేనే హైలైట్!

Realme Neo 8 infinite edition: ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌గా మార్కెట్‌లోకి కొత్త సరుకు.. శాంసంగ్ AMOLED డిస్‌ప్లేనే హైలైట్!
Advertisement

Realme Neo 8 Infinite Edition: రియల్‌మీ తన నియో సిరీస్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా లీక్‌లు సూచిస్తున్నాయి. ఇప్పటికే రియల్‌మీ నియో 7కి అప్‌డేట్ వెర్షన్‌గా రియల్‌మీ నియో 8 త్వరలో చైనా మార్కెట్లో లాంచ్ కానుందని సమాచారం. ఇదే సిరీస్‌లో మరో స్పెషల్ మోడల్‌గా ‘రియల్‌మీ నియో 8 ఇన్‌ఫినైట్ ఎడిషన్’ కూడా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లాంచ్ ఎప్పుడంటే..

ఇటీవల వీబోలో ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ అనే టిప్‌స్టర్ షేర్ చేసిన రిటైల్ బాక్స్ ప్రకారం.. Realme Neo 8 Infinite Edition అనే పేరు స్పష్టంగా కనిపించడంతో పాటు ‘Next AI’ లోగో కూడా ఉండటం గమనార్హం. దీని ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ అభివృద్ధి చేసిన AI ఆధారిత ఫీచర్లకు మద్దతు ఇవ్వబోతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఫోన్‌ 2026 జనవరిలో చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది.

అడ్వాన్స్డ్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్:

Advertisement

డిస్‌ప్లే విషయంలో ఈ ఇన్‌ఫినైట్ ఎడిషన్ ప్రత్యేకంగా నిలవనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌లో కస్టమ్ Samsung M14 AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశముంది. 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో పాటు కొత్త ల్యూమినిసెంట్ మెటీరియల్స్‌ను ఉపయోగించడంతో డిస్‌ప్లే మరింత బ్రైట్‌గా, షార్ప్‌గా ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే, కళ్లపై ఒత్తిడి తగ్గించే అడ్వాన్స్డ్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

శక్తివంతమైన పనితీరు:

ఇక స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. రియల్‌మీ నియో 8 సిరీస్ హై-పర్‌ఫార్మెన్స్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 3nm టెక్నాలజీపై ఆధారపడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 6.78 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్‌తో విజువల్ అనుభవం మరింత మెరుగ్గా ఉండనుంది.

80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

Advertisement

ఈ రియల్‌మీ నియో 8 ఇన్‌ఫినైట్ ఎడిషన్‌.. భారీ 8,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది దీర్ఘకాలిక వినియోగం, వేగవంతమైన ఛార్జింగ్‌ను అందించగలదు. ఇక కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉండే అవకాశముండగా, సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందించనున్నారు.

ప్రీమియం ఫీచర్లు:

ఇకపోతే ఈ హ్యాండ్ సెట్ LPDDR5x RAM, UFS 4.1 స్టోరేజ్‌తో పాటు Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి తాజా కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉండనుంది. దీంతోపాటు X-axis లీనియర్ మోటార్, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను ప్రీమియం సెగ్మెంట్‌కు దగ్గరగా తీసుకెళ్తున్నాయి.

శాంసంగ్ AMOLED డిస్‌ప్లే:

మొత్తంగా చూస్తే.. బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే క్వాలిటీ, ప్రాసెసర్ పనితీరు పరంగా Realme Neo 8 సిరీస్ టెక్ ప్రియులను ఆకట్టుకునే ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్‌ఫినైట్ ఎడిషన్‌‌లో ఉండే శామ్‌సంగ్ AMOLED డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. అయితే రియల్‌మీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×