E-Paper
Advertisement

Mowgli OTT : మరికొన్ని గంటల్లో ‘మోగ్లీ’ స్ట్రీమింగ్… ఈ డిజాస్టర్ మూవీని ఓటీటీలో ఎందుకు చూడాలంటే ?

Mowgli OTT : మరికొన్ని గంటల్లో ‘మోగ్లీ’ స్ట్రీమింగ్… ఈ డిజాస్టర్ మూవీని ఓటీటీలో ఎందుకు చూడాలంటే ?
Advertisement

Mowgli OTT  : 2025 ముగిసిపోతున్న తరుణంలో మరికొన్ని గంటల్లో ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. నిజానికి ఈ ఏడాది ఎన్నో మూవీస్ వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసును గెలిచాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

డిసెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా ‘మోగ్లీ’. బాక్సాఫీస్‌ దగ్గర డిసప్పాయింట్ చేసిన ఈ మూవీకి ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరో రోషన్ కనకాల హీరోగా నటించాడు. మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది కానీ పూర్ మౌత్ టాక్ వల్ల వసూళ్లు డల్ అయ్యాయి. ఇక ఇప్పుడు 2026 జనవరి 1 నుండి ETV Win ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఇంట్లో చూడొచ్చు. మరి థియేటర్లలో డిజాస్టర్ అన్పించుకున్న ఈ మూవీని అసలు ఓటీటీలో ఎందుకు చూడాలంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

Advertisement

సందీప్ రాజ్ డైరెక్షన్‌లో ‘కలర్ ఫోటో’ టీమ్ మళ్లీ కలిసి ఈ మూవీ తెరకెక్కించారు. రోషన్ కనకాల మెయిన్ హీరోగా, స్ట్రగ్లింగ్ యువకుడి పాత్రలో కనిపించాడు. హీరోయిన్లుగా సాక్షి మాధోల్కర్ (మూగ అమ్మాయిగా), నేహా పఠాన్ ఉన్నారు. విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఎంటర్‌టైన్ చేశాడు. స్నేహా ఉల్లాల్ స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపిస్తుంది. అజయ్ అరసడ సంగీతం, సముద్రకని సినిమాటోగ్రఫీ… ఇలా టెక్నికల్‌గా మూవీ స్ట్రాంగ్ ఉంది. బడ్జెట్ మోడరేట్‌గా ఉండటం వల్ల నిర్మాతలు డిజిటల్ రైట్స్ సేఫ్ ప్రైస్‌కి సెల్ చేసి సేఫ్ జోన్‌లోకి వచ్చేశారు. మూవీకి మెయిన్ స్ట్రెంగ్త్ రోషన్ కనకాల. స్ట్రగ్లింగ్ యువకుడిగా రియలిస్టిక్‌గా కనిపించాడు. ఘర్షణ సీన్స్‌లో అతని ఇంటెన్సిటీ సూపర్. సాక్షి మాధోల్కర్ మూగ పాత్రలో ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. వీళ్ళ సైలెంట్ లవ్ స్టోరీ టచ్ చేస్తుంది.

బండి సరోజ్ కుమార్ విలన్‌గా క్రేజీ పోలీస్ రోల్‌లో హిలేరియస్‌గా, డేంజరస్‌గా కనిపించాడు. అతని డైలాగ్స్ వల్ల సెన్సార్ బోర్డు మూవీకి A సర్టిఫికేట్ ఇచ్చింది. స్నేహా ఉల్లాల్ గెస్ట్ రోల్ చిన్నదే కానీ ఇంపాక్ట్ ఉంది. ఈ ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్ మూవీలో సెకండ్ హాఫ్ హైలైట్. రోషన్, బండి మధ్య క్లాషెస్ బాగుంటాయి. చివరి 20 నిమిషాలు టెన్షన్ ఫుల్, ఎమోషనల్ డ్రామా మిక్స్ అయ్యి హైలెట్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేశాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా థియేటర్లలో పూర్ మౌత్ టాక్ వల్ల మోగ్లీ ఫ్లాప్ అయింది. ఓపెనింగ్ మాత్రమే బాగుంది.

Advertisement

Read Also :  హీరోయిన్ పై పొలిటికల్ లీడర్ మోజు… హై వోల్టేజ్ షాకిచ్చే క్లైమాక్స్… జన్మలో అమ్మాయిల జోలికి వెళ్లరు

స్టోరీలోకి వెళ్తే…

మోగ్లీ ఒక సాధారణ రొమాంటిక్ డ్రామా. మోగ్లీ అనే యువకుడు అడవిలో పెరుగుతాడు. ఒక మూగ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయిపై ఒక క్రూరమైన అటవీ అధికారి కన్ను పడుతుంది. అతని నుండి తన ప్రేయసిని కాపాడడానికి మోగ్లీ చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ప్రేమ, లస్ట్ మధ్య జరిగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ? హీరోయిన్ ను హీరో ఎలా కాపాడాడు? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే. టైమ్ పాస్‌గా చూడటానికి బాగుంటుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×