E-Paper
Advertisement

Smartphone comparison: రియల్‌మీ నార్జో 90 vs మోటో G67 పవర్ vs ఐకూ Z10R.. మిడ్‌రేంజ్ లో ఏది బెస్ట్?

Smartphone comparison: రియల్‌మీ నార్జో 90 vs మోటో G67 పవర్ vs ఐకూ Z10R.. మిడ్‌రేంజ్ లో ఏది బెస్ట్?
Advertisement

భారత్‌లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విపీరతమైన పోటీ ఉంది. మధ్యతరగతి బయ్యర్ల కోసమే రియల్‌మీ బ్రాండ్ ఇటీవలే రియల్ మీ నార్జో 90 5G ఇటీవల లాంచ్ చేసింది. ఫీచర్ల పరంగా ఈ కొత్త ఫోన్ మోటో G67 పవర్ 5G, ఐకూ Z10R 5Gలతో డైరెక్ట్ పోటీలో ఉంది. మూడూ 5G కనెక్టివిటీ, ఆధునిక హార్డ్‌వేర్ ఇస్తాయి. కానీ ఫీచర్స్, ధర చూస్తే.. వేర్వేరు యూజర్ అవసరాలకి సరిపోతాయి. అందుకే ఏ కొత్త ఫోన్ కొనాలని నిర్ణయం తీసుకునేముందు వీటి ఫీచర్ల పోల్చి మీకు ఏది బెస్ట్ అని నిర్ణయించుకోండి.

ధర, వివరాలు

రియల్‌మీ నార్జో 90: 6GB+128GB – రూ.16,999; 8GB+128GB – రూ.18,499.
మోటో G67 పవర్: 8GB+128GB – రూ.15,999 (సింగిల్ వేరియంట్).
ఐకూ Z10R: 8GB+128GB – రూ.19,499; 8GB+256GB – రూ.21,499.
తక్కువ ధరలో మోటో G67 పవర్ మంచి వేరియంట్ అందిస్తోంది.

డిస్‌ప్లే ఎలా ఉంది?

Advertisement

రియల్‌మీ నార్జో 90లో 6.57 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది Full HD+, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
మోటో G67 పవర్ లో 6.7 అంగుళాల Full HD+ LCD స్క్రీన్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ (కానీ LCD కాబట్టి కాంట్రాస్ట్ తక్కువ).
ఐకూ Z10Rలో 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్‌డ్ AMOLED – Full HD  డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. డిస్‌ప్లేలో iQOO బెస్ట్.

పర్ఫామెన్స్, ప్రాసెసర్ ఎలా ఉంది?

రియల్‌మీ నార్జో 90లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 Max – రోజువారీ టాస్క్‌లు స్మూత్‌గా జరుగుతాయి.
మోటో G67 పవర్ లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 – గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో మంచి పర్ఫామెన్స్.
ఐకూ Z10Rలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (4nm) – మూడింటిలో అతి బెస్ట్ పర్ఫామెన్స్.

బ్యాటరీ, ఛార్జింగ్ ఎలా ఉంది?

Advertisement

రియల్‌మీ నార్జో 90, మోటో G67 పవర్ లో 7,000mAh బ్యాటరీ ఉంది. Realmeలో 60W ఫాస్ట్ ఛార్జింగ్, Motoలో 30W.
ఐకూ Z10Rలో 5,700mAh బ్యాటరీ + 44W ఛార్జింగ్. బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్‌లో Realme ముందు.

సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది?

మూడు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15తో వస్తాయి – రియల్‌మీలో Realme UI 6.0, Motoలో Hello UX, iQOOలో Funtouch OS 15. ఆధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ ఉన్నాయి.

కెమెరా ఎలా ఉంది?

రియల్‌మీ నార్జో 90లో 50MP మెయిన్ + 2MP మోనోక్రోమ్ రియర్, 50MP సెల్ఫీ కెమెరా ఉంది.
మోటో G67 పవర్ లో 50MP మెయిన్ + 8MP అల్ట్రావైడ్ రియర్, 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
ఐకూ Z10Rలో 50MP మెయిన్ + 2MP సెకండరీ రియర్, 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

Also Read: సిసిటివి అవసరం లేదు.. మీ పాత ఫోన్‌‌‌తో సెక్యూరిటీ కెమెరా తయారు.. చాలా ఈజీ

కనెక్టివిటీ ఫీచర్స్ ఏమిటి?

రియల్‌మీ లో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
మోటో లో కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే.. 5G, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1.
ఐకూ Z10R లో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది.

ఏ ఫోన్ బెస్ట్?

బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే రియల్‌మీ నార్జో 90. తక్కువ ధరలో మంచి పర్ఫామెన్స్ కావాలంటే మోటో G67 పవర్. బెస్ట్ డిస్‌ప్లే, ప్రాసెసర్ కావాలంటే ఐకూ Z10R. మీ అవసరాలు – పర్ఫామెన్స్, బ్యాటరీ లేదా డిస్‌ప్లే – బట్టి ఎంచుకోండి.

ఈ మూడు ఫోన్‌లు మిడ్ రేంజ్‌లో స్ట్రాంగ్ ఆప్షన్స్ – మీ బడ్జెట్, ప్రిఫరెన్స్ బట్టి సెలెక్ట్ చేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×