E-Paper
Advertisement

Realme GT 8 Pro Alternatives: రియల్ మి GT 8 ప్రో కంటే ఈ ఫోన్లు బెటర్.. తక్కువ బడ్జెట్‌లో సేమ్ ఫీచర్స్

Realme GT 8 Pro Alternatives: రియల్ మి GT 8 ప్రో కంటే ఈ ఫోన్లు బెటర్.. తక్కువ బడ్జెట్‌లో సేమ్ ఫీచర్స్
Advertisement

Realme GT 8 Pro Alternatives| రియల్‌ మి GT 8 ప్రో ఇటీవలే లాంచ్ అయిన బెస్ట్ కెమెరా ఫోన్. ఈ ఫోన్ ధర రూ.72,999. అయితే ఇలాంటి సేమ్ ఫీచర్స్ ఇచ్చే ఫోన్స్ చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. బ్యాటరీ, కెమెరా, స్పీడ్ లో ఈ ఫోన్స్ బెస్ట్ ఆప్షన్స్.

వన్‌ప్లస్ 15 – భారీ బ్యాటరీ

వన్‌ప్లస్ 15 లో పెద్ద 7300 mAh బ్యాటరీ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ గేమింగ్ కి సూపర్. ట్రిపుల్ 50MP కెమెరా, 3.5x జూమ్ ఇస్తాయి. ధర కూడా రూ.72,999 మాత్రమే. 165Hz AMOLED స్క్రీన్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. రోజూ ఫోన్ ఎక్కువ ఉపయోగించేవారికి ఈ ఫోన్ పర్ఫెక్ట్.

రియల్‌ మి GT 7 ప్రో – అదే బ్రాండ్ లో మరో ఫోన్

Advertisement

రియల్‌ మి GT 7 ప్రో ధర రూ.50,999 మాత్రమే. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ సూపర్ ఫాస్ట్. 50MP+50MP+8MP కెమెరాలు అదిరిపోయే ఫోటోలు తీస్తాయి. ఇందులోని 6500 mAh బ్యాటరీ వీడియో కాల్స్ కి బెస్ట్. 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే రంగులు బాగా కనిపిస్తాయి.

గూగుల్ పిక్సెల్ 9a – కెమెరా మ్యాజిక్

పిక్సెల్ 9a ధర రూ.44,999 మాత్రమే. ఇందులోని టెన్సర్ G4 చిప్ స్మూత్ గా పనిచేస్తుంది. 5100 mAh బ్యాటరీ 23W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 48MP+13MP కెమెరాలు అద్భుతమైన ఫోటోలు ఇస్తాయి. 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి.

ఒప్పో ఫైండ్ X9 – ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ

Advertisement

ఒప్పో ఫైండ్ X9 ధర రూ.74,999. ఈ ఫోన్‌లో హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ 50MP కెమెరాలు. 3x ఆప్టికల్ జూమ్, లేజర్ ఫోకస్ ఉన్నాయి. పెద్ద 7025 mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు నడుస్తుంది. ఫోన్‌లో 6.59 అంగుళాల డిస్‌ప్లే చాలా క్లియర్ గా ఉంటుంది.

వన్‌ప్లస్ 13s – చిన్న సైజ్ లో పెద్ద పవర్

వన్‌ప్లస్ 13s ధర కేవలం రూ.49,999. ఫోన్‌లో 6.32 అంగుళాల LTPO AMOLED స్క్రీన్ ఉంది. డ్యూయల్ 50MP + 32MP సెల్ఫీ కెమెరా. 5850 mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఒక్క చేత్తో ఫోన్ యూజ్ చేయడం చాలా సులువు.

వివో X200 FE – బెస్ట్ ఆల్ రౌండర్

వివో X200 FE ఫోన్ ధర రూ.59,999. 50MP+50MP+8MP ట్రిపుల్ కెమెరా సెటప్, 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. డైమెన్సిటీ 9300+ చిప్ గేమింగ్ కి బాగుంటుంది. IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ ఉంది.

ఫోన్ కొనేముందు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ముందు బ్యాటరీ లైఫ్ మీ రోజువారీ యూజ్‌కి సరిపడుతుందో చూడండి. ఆన్‌లైన్ లో కెమెరా శాంపిల్స్ చూసుకోండి. బ్యాంక్ ఆఫర్స్ తో ఇంకా తక్కువ ధరకే ఫోన్ కొనొచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎక్కువ కాలం వచ్చే ఫోన్ ఎంచుకోండి. ఫోన్ కొనేముందు దాని సైజ్, బరువు ముందే చెక్ చేసుకోండి.

Also Read: ఐఫోన్ పోగొట్టుకున్నారా? లేదా చోరీ అయిందా? ఆపిల్ కొత్త ఐఫోన్ ఇస్తోంది.. వారికి మాత్రమే

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×