E-Paper
Advertisement

Realme Discount: 50 MP ట్రిపుల్ కెమెరా గల రియల్‌‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ15000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Realme Discount: 50 MP ట్రిపుల్ కెమెరా గల రియల్‌‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ15000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
Advertisement

Realme Flagship Discount| రియల్‌మీ కంపెనీ తన హై-ఎండ్ ఫోన్ జీటీ 7 ప్రో ధరను భారీగా తగ్గించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ లాంచ్ ధర రూ.59,999. కానీ ఇప్పుడు రూ.15,000 డిస్కౌంట్‌ ఆఫర్ లభిస్తోంది. ఈ అద్భుత ఆఫర్‌తో 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.44,498కే దొరుకుతోంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఉంది. బ్యాంక్ కార్డులతో మరిన్ని డిస్కౌంట్లు వస్తాయి. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్ ఇస్తే రూ.33,300 వరకు తగ్గించుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో రియల్‌మీ జీటీ 8 ప్రో లాంచ్‌ కానుండగా.. జిటి 7 ప్రోపై కంపెనీ, ప్లిప్ ‌కార్ట్ లో ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ ఇంత చవకగా కొనేందుకు ఇదే అద్భుత అవకాశం!

డిస్‌ప్లే

ఈ ఫోన్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. 6.78 అంగుళాల పెద్ద ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఉంది. ఇది 1.5కే ఎకో2 ఓఎల్‌ఇడీ ప్లస్ స్క్రీన్. రిజల్యూషన్ ఎఫ్‌హెచ్‌డీ+ (2780 x 1264 పిక్సెల్స్). స్క్రీన్-టు-బాడీ రేషియో 94.2 శాతం. చుట్టూ చాలా సన్నని బెజెల్స్ ఉంటాయి. పీక్ బ్రైట్‌నెస్ 6500 నిట్స్ వరకు వెళ్తుంది. బయట ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. గేమింగ్, వీడియోలు చూడటం సూపర్‌గా ఉంటుంది.

ప్రాసెసర్

Advertisement

పర్ఫామెన్స్‌లో ఈ ఫోన్ టాప్ లెవెల్. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంది. ఇది 3నానోమీటర్ టెక్నాలజీతో తయారైంది. స్పీడ్ చాలా ఎక్కువ. 16జీబీ ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. రియల్‌మీ యూఐ 6.0 ఇంటర్‌ఫేస్ స్మూత్‌గా పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్, హెవీ గేమ్స్ ఎలాంటివైనా సులభంగా రన్ అవుతాయి.

బ్యాటరీ

బ్యాటరీ కెపాసిటీ 5,800ఎంఏహెచ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా పనిచేస్తుంది. బాక్స్‌లోనే 120w సూపర్‌ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. కొద్ది నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు.

కెమెరా

Advertisement

కెమెరా సిస్టమ్ అదిరిపోతుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్. మెయిన్ కెమెరా 50ఎంపీ సెన్సార్‌తో ఓఐఎస్ సపోర్ట్. 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా పెద్ద సీన్లు తీస్తుంది. 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ ఇస్తుంది. 120x సూపర్ జూమ్ కూడా ఉంది. దూరంలోని వస్తువులు క్లోజప్‌గా తీయవచ్చు. ఫ్రంట్ కెమెరా 32ఎంపీ. సెల్ఫీలు, వీడియో కాల్స్ సూపర్ క్వాలిటీతో వస్తాయి. ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ పర్ఫెక్ట్.

మొత్తంమీద రియల్‌మీ జీటీ 7 ప్రో ఫీచర్స్‌తో నిండిన ఫ్లాగ్‌షిప్. ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో కొనడం స్మార్ట్ ఛాయిస్. ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసి, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఉపయోగించి మరింత చవకగా కొనుగోలు చేయండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే మిస్ చేయకండి!

Also Read:  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×