E-Paper
Advertisement

Supermoon Bluemoon: దశాబ్దాల్లో ఒకసారి మాత్రమే కనిపించే అరుదైన చంద్రుడు.. ఆకాశంలో ఈ రోజు మాత్రమే..

Supermoon Bluemoon: దశాబ్దాల్లో ఒకసారి మాత్రమే కనిపించే అరుదైన చంద్రుడు.. ఆకాశంలో ఈ రోజు మాత్రమే..
Advertisement

Supermoon Bluemoon| ఆకాశంలో చంద్రుడిని గమనించేవారు ఆగస్టు నెలలో ఒక అరుదైన దృశ్యం చూడవచ్చు. ఎప్పుడో దశాబ్దాల్లో ఒకసారి మాత్రమే అరుదుగా కనిపించే చంద్రుడు ఆగస్టు 19న భూ గ్రహ వాసులకు దర్శనం ఇవ్వనున్నాడు. అరుదుగా కనిపించే ఈ పౌర్ణమి చంద్రుడు.. చాలా పెద్ద ఆకారంలో ప్రకాశవంతంగా ఉంటాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చంద్రుడిని ఇంగ్లీషులో సూపర్ మూన్ బ్లూ మూన్ అని అంటారు. ఈ చంద్రుడు సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే ఎక్కువ పెద్దగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆగస్టు లో పూర్ణ చంద్రుడు కాబట్టి దీనికి ‘స్టర్ జయోన్ బ్లూ మూన్’ అని కూడా పిలుస్తారు.

బ్లూ మూన్ అంటే ఏమిటి?
బ్లూ మూన్ అనగానే అందరూ నీలి చంద్రుడు అని భావిస్తారు. కానీ నిజానికి చంద్రుడు నీలి రంగులో ఉండడు. ఇంగ్లీషులో బ్లూ మూన్ అంటే ప్రత్యేక చంద్రుడు అని అర్థం. బ్లూ మూన్ రెండు రకాలు. ఒకటి నెలకోసారి వచ్చే పౌర్ణమి చంద్రుడు. రెండవది సీజనల్ బ్లూన్ అంటే నాలుగు పౌర్ణమి చంద్రులలో ఒక ప్రత్యేక చంద్రుడు. సాధారణంగా సీజనల్ బ్లూ మూన్ ప్రతి నాలుగు పౌర్ణమి చంద్రులలో మూడో చంద్రుడు అని శాస్త్రవేత్తుల అభిప్రాయం. కొన్ని సార్లు ఆ ప్రత్యేక చంద్రుడు నాలుగో స్థానంలో కూడా కనిపిస్తాడు. అయితే ఇలాంటి ప్రత్యేక చంద్రుడు భూగ్రహానికి అతిసమీపంలో వచ్చినప్పుడు దాని ఆకారం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడి కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇలా జరగడం చాలా చాలా అరుదు. అందుకే దీనిని సూపర్ మూన్ బ్లూ మూన్ అని పిలుస్తారు.
ఇప్పుడు ఈ ప్రత్యేక చంద్రుడు.. సూపర్ మూన్ బ్లూన్ మూన్ అంటే చాలా అరుదుగా కనిపించే చంద్రుడే ఆగస్టు 19 కనిపించబోతున్నాడు.

Advertisement

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాజీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గోర్డన్ జాన్స్‌టన్ ఈ సూపర్ మూన్ బ్లూన్ మూన్ గురించి వివరించారు. ”ఇది సాధారణంగా కనిపించే బ్లూ మూన్ లలో అరుదుగా కనిపిస్తుంది. సీజనల్ బ్లూ మూన్ లలో మూడో బ్లూ మూన్ గా మనకు కనిపిస్తుంది. కానీ భూమికి అతిసమీపంగా చంద్రుడు ఉండే సమయంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ అరుదైన చంద్రుడు కనిపిస్తాడు. దీన్ని తొలిసారి గా 1528లో గుర్తించడం జరిగింది. అప్పటినుంచి దీనిని సూపన్ మూన్ బ్లూ మూన్ అని పిలవడం జరుగుతోంది.” అని ఆయన తెలిపారు.

అరుదైన చంద్రుడిని ఆగస్టు 19న ఏ సమయంలో చూడవచ్చంటే..
భూసమీపంగా ఉండే ఈ పౌర్ణమి చంద్రుడిని ఆగస్టు 19న చూడవచ్చు. సోమవారం రాత్రి 11:56 గంటలకు ఈ ప్రత్యేక పౌర్ణమి చంద్రుడిని పూర్తి రూపంలో చూడవచ్చు. ఈ ప్రత్యేక పౌర్ణమి చంద్రడు తూర్పు, ఆగ్నేయం దిశ నుంచి ఉదయిస్తాడు. గాలి కాలుష్యం, ఇతర సమస్యలు లేని ప్రదేశం నుంచి ఈ చంద్రుడిని చూసి ప్రకృతి అద్భుతాన్ని ఆస్వాదించండి. మానవ కళ్లతో దీనిని చూడడంలో ఏ హాని లేదు.. కానీ బైనాకులర్స్ లేదా టెలీస్కోప్ ద్వారా ఈ అరుదైన చంద్రుడి సాక్షాత్కారాన్ని చూస్తే.. మరిచిపోలేని అనుభూతిని కలుగుతుంది.

Advertisement

2024 సంవత్సరంలో మరో మూడు బ్లూ మూన్స్‌ని చూడవచ్చు. అక్టోబర్ 17, సెప్టెంబర్ 17, ఆ తరువాత నవంబర్ 15. వీటిలో సెప్టెంబర్ 17 కనిపించే పౌర్ణమి చంద్రుడికి భూగ్రహ నీడ పాక్షికంగా అడ్డుపడుతుంది.

Also Read: రెండు నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. ఆరోగ్య సమస్యలు తీవ్రం.. ఏం జరిగిదంటే..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×