E-Paper
Advertisement

వర్షంలో ఫోన్ తీసుకెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకో మామ.. లేదంటే మెుబైల్ మటాషే!

వర్షంలో ఫోన్ తీసుకెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకో మామ.. లేదంటే మెుబైల్ మటాషే!
Advertisement

Phone Protection: రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఈ వర్షాలు చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లకు పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదముంది. వాన నీటిలో ఫోన్ ఏమాత్రం తడిసినా.. స్క్రీన్ పాడవ్వడం, మదర్‌బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం లాంటి భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలతో ఫోన్ ను వర్షాల నుంచి ఏ విధంగా కాపాడుకోవచ్చో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు

వర్షంలో బయటకు వెళ్లేటప్పుడు ఫోన్‌కు ‘వాటర్‌ప్రూఫ్ జిప్‌లాక్ పౌచ్’ తొడగడం మంచిది. దీని ధర చాలా తక్కువే కాబట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బైక్‌లపై ప్రయాణించే వారు తప్పనిసరిగా ఈ పౌచ్‌లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్

Advertisement

వర్షం పడుతున్నప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి వస్తే, ఫోన్‌ను నేరుగా చెవి దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదు. దీనివల్ల స్పీకర్ గ్రిల్స్, ఛార్జింగ్ పోర్ట్ ద్వారా నీరు లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫోన్‌ను బ్యాగ్‌లోనే ఉంచి.. కాల్స్ మాట్లాడటానికి బ్లూటూత్ ఇయర్‌ బడ్స్ లేదంటే నెక్ బ్యాండ్‌ ను ఉపయోగిస్తే బెటరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తడి చేతులతో తాకవద్దు

చాలామంది వర్షంలో తడిసి ఇంటికి రాగానే అదే తడి చేతులతో ఫోన్‌ను వాడుతుంటారు. ఇలా చేస్తే.. ఫోన్‌ పవర్‌బటన్, వాల్యూమ్ బటన్ల సందుల గుండా తేమ లోపలికి చేరే అవకాశం ఉంది. కాబట్టి చేతులను పూర్తిగా తుడుచుకున్న తర్వాతే ఫోన్‌ను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: రోజూ అంట్లు తోమి విసిగిపోయారా? ఈ డిష్‌వాషర్లు కొంటే.. మీ కష్టాలన్నీ తీరినట్లే!

ఫోన్ తడిస్తే ఏం చేయాలి?

ఒకవేళ పొరపాటున ఫోన్ వర్షంలో తడిసిపోతే వెంటనే చేయాల్సిన పనులను సైతం నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ ఆన్‌లో ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్విచాఫ్ చేయాలని పేర్కొంటున్నారు. మరోవైపు తడిసిన ఫోన్ కు ఎట్టి పరిస్థితుల్లో ఛార్జింగ్ పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఫోన్ ను పొడిగా మార్చేందుకు డ్రైయర్ లాంటి వాటిని కూడా అస్సలు వాడొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫోన్‌ను పొడి గుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద ఉంచితే తేమ పోతుందని వివరిస్తున్నారు.

Also Read: షావోమి మరో అద్భుతం.. దుమ్మురేపే స్మార్ట్ కుక్కర్ లాంచ్.. ఇక బుల్లెట్ స్పీడ్‌తో వంట!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×