// // Data Privacy: రైల్వే స్టేషన్, హోటల్స్‌లో ఫ్రీ వైఫై వాడుతున్నారా? -->
E-Paper
Advertisement

మీ ప్రైవేట్ ఫొటోలు, చాట్స్ హ్యాకర్స్ చేతికి వెళ్లకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఇలా చేయండి!

మీ ప్రైవేట్ ఫొటోలు, చాట్స్ హ్యాకర్స్ చేతికి వెళ్లకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఇలా చేయండి!
Advertisement

Data Privacy: సాధారణంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లలో అందుబాటులో ఉండే ఫ్రీ పబ్లిక్ వైఫైని మనం తరచూ వాడుతుంటాము. ఉచితంగా ఇంటర్నెట్ వస్తోంది కదా అని ఆనందపడతాం కానీ, దీని వెనుక ఎన్నో భద్రతా ముప్పులు పొంచి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతాం. అందుకే పబ్లిక్ వైఫై ఉపయోగించేటప్పుడు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన వ్యక్తిగత డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

బ్యాంకింగ్ లావాదేవీలు వద్దు:

పబ్లిక్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ చేయడం లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయడం అస్సలు మంచిది కాదు. హాకర్లు ఈ నెట్‌వర్క్ ద్వారా మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి అత్యంత కీలకమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సులభంగా దొంగిలించే ప్రమాదం ఉంది. అత్యవసరమైతే తప్ప ఇలాంటి చోట్ల ఆర్థిక లావాదేవీలు చేయకూడదు.

VPN ఉపయోగించడం ఉత్తమం:

Advertisement

పబ్లిక్ వైఫై వాడాల్సి వచ్చినప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ అంటే విపిఎన్ వాడటం చాలా సురక్షితమైన మార్గం. ఇది మన ఫోన్ లేదా లాప్‌టాప్ డేటాను ఇతరులకు కనిపించకుండా ప్రైవసీ కల్పిస్తుంది. దీంతో నెట్‌వర్క్‌లో ఎవరైనా దొంగచాటుగా చూసినా మన సమాచారం వారికి అర్థం కాదు. కాబట్టి నమ్మకమైన విపిఎన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉంచుకోండి.

Also Read: లీకైన గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ఈ కలర్, డిజైన్ చూస్తే టెక్ ప్రియులకు పిచ్చెక్కిపోవాల్సిందే!

ఆటో కనెక్ట్ ఫీచర్ ఆన్ చేయొద్దు:

Advertisement

మనలో చాలామంది ఫోన్లలో వైఫై ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. దీనివల్ల ఏదైనా పబ్లిక్ నెట్‌వర్క్ పరిధిలోకి వెళ్లినప్పుడు ఫోన్ ఆటోమేటిక్‌గా దానికి కనెక్ట్ అయిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. అందుకే మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటో కనెక్ట్ ఆప్షన్‌ను ఆఫ్‌లో ఉంచుకోవడం మంచిది. అవసరమైనప్పుడు మాత్రమే నమ్మకమైన నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవాలి.

టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ ముఖ్యం:

సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్‌కు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ కచ్చితంగా సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఎవరైనా మన పాస్‌వర్డ్ తెలుసుకున్నా కూడా.. మన పర్మిషన్ లేకుండా లాగిన్ అవ్వడం సాధ్యం కాదు. ఇది మన ఖాతాలకు అదనపు రక్షణ కల్పిస్తుంది. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు https ఉన్న వెబ్‌సైట్‌లను మాత్రమే ఓపెన్ చేయడం కూడా మరొక ముఖ్యమైన భద్రతా సూత్రం అని గ్రహించాలి.

Also Read: ఆఫ్‌లైన్ AI అసిస్టెంట్‌తో ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ ‘StepX Neo’ను లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×