E-Paper
Advertisement

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్
Advertisement

PS5 Ghost Of Yotei Sales| గేమింగ్ రంగంలో PS5 (ప్లే స్టేషన్ 5) గేమ్స్ విపరీతమైన ఆదరణ ఉంది. ఈ PS5 గేమ్స్ లో తాజాగా ఓజీ తరహా ఒక గేమ్ విడుదలైంది. అయితే ఈ గేమ్ విడుదల కాగానే అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేసింది. ఈ గేమ్ పేరు ఘోస్ట్ ఆఫ్ యోటీ. ఈ గేమ్ విడుదల అయిన మొదటి రోజే ఖర్చు పెట్టిన బడ్జెట్ మొత్తం వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. ఈ ప్లేస్టేషన్ 5 ఎక్స్‌క్లూజివ్ గేమ్ ఒక వారంలోనే 16 లక్షల కాపీలు సేల్స్ చేసింది. పైగా ఈ గేమ్ సేల్స్ బ్లాక్ బస్టర్ తరహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సోనీ కంపెనీకి ఒక జాక్ పాట్ లాంటిది.

రికార్డు స్థాయి ఆర్థిక వసూళ్లు

ఘోస్ట్ ఆఫ్ యోటీ తొలి రోజే తన నిర్మాణ ఖర్చును పూర్తిగా వసూలు చేసింది. ఈ గేమ్‌ను తయారు చేయడానికి ఖర్చు చేసిన మొత్తం డబ్బును మొదటి రోజు వచ్చిన $60 మిలియన్ల ఆదాయాన్ని సమం చేసింది. గేమింగ్ పరిశ్రమలో ఇలాంటి వేగవంతమైన ఆర్థిక వసూళ్లు చాలా అరుదు.

అద్భుతమైన సేల్స్

Advertisement

ఘోస్ట్ ఆఫ్ యోటీ ఇప్పటివరకు మొత్తం 20 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి. ఇప్పుటివరకు ఈ గేమ్ ద్వారా $100 మిలియన్ల పైగా ఆదాయం వచ్చింది. సోనీ PS5 గేమ్‌లలో ఇది రెండో అత్యధిక సేల్స్ సాధించిన లాంచ్‌గా నిలిచింది.

మునుపటి గేమ్‌తో పోలిక

ఘోస్ట్ ఆఫ్ యోటీ ఇంతకు ముందు వచ్చిన గేమ్‌తో పోలిస్తే కొంచెం వెనుకబడింది. ఆ మొదటి గేమ్ విడుదలైన మూడు రోజుల్లో 24 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. అయినప్పటికీ, యోటీ పనితీరు చాలా అద్భుతంగా ఉంది. 93% మంది గేమర్స్ ఇప్పటికే మొదటి గేమ్‌ను పూర్తి చేసి ఘోస్ట్ ఆఫ్ యోటీ పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు.

పోటీలో ఆధిపత్యం

Advertisement

ఈ గేమ్ అమ్మకాలు ‘అస్సాసిన్స్ క్రీడ్ షాడోస్‌’ కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గేమ్ సేల్స్ అస్సాస్సిన్స్ క్రీడ్ కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ అమ్మకాల్లో 77 శాతం డిజిటల్ కాపీలు, మిగిలినవి ఫిజికల్ కాపీలు.

క్రిటిక్స్ ప్రశంసలు

విమర్శకులు ఈ గేమ్ యొక్క విజువల్ ప్రెజెంటేషన్‌ను ఎంతగానో ప్రశంసించారు. గేమ్‌లోని కాంబాట్ ఫైట్ సిస్టమ్ చాలా ఆలోచనాత్మకంగా రూపొందించబడిందని, ఓపెన్-వరల్డ్ కాన్సెప్ట్ కూడా బాగా ఆకర్షించిందని విమర్శకులు చెప్పారు. ఈ గేమ్ కు అందరూ టాప్ రివ్యూస్ ఇస్తున్నారు.

డెవలపర్, అభిమానుల మద్దతు

ఈ సీక్వెల్‌ గేమ్‌ని సక్కర్ పంచ్ అనే డెవలపర్ కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీకి అభిమానుల్లో గొప్ప ఆదరణ ఉంది. ఈ కంపెనీ గేమ్స్ పట్ల గేమింగ్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ గేమ్ విజయానికి ఇదే పెద్ద కారణం.

ప్లాట్‌ఫామ్ లభ్యత

ప్రస్తుతం ఈ గేమ్ కేవలం PS5లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విడుదల గురించి ఇంకా సమాచారం లేదు. భవిష్యత్తులో సోనీ ఈ గేమ్‌ను ఇతర ప్లాట్‌ఫామ్‌లలో, ముఖ్యంగా PCలో కూడా విడుదల చేయవచ్చు.

భవిష్యత్ సేల్స్ అంచనాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ గేమ్ సేల్స్ భవిష్యత్తులో కూడా బాగా జరిగే అవకాశాలున్నాయి. రాబోయే కొన్ని వారాల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ గేమ్ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×