// // Neve Share AI Details: ఏఐ చాట్‌బాట్‌తో షేర్ చేయకూడని 8 విషయాలు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

ఏఐ చాట్‌బాట్‌తో షేర్ చేయకూడని 8 విషయాలివే!

ఏఐ చాట్‌బాట్‌తో షేర్ చేయకూడని 8 విషయాలివే!
Advertisement

Neve Share AI Details: ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ టెక్నాలజీ గురించే. జెమిని, చాట్ జీపీటీ, ఇలా చాలా మోడళ్లలో ఏఐ చాట్ బాట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం అప్లోడ్ చేసే ప్రతి విషయాన్ని ఏఐ రీడ్ చేస్తుందని తెలుసా. స్టాన్‌ఫోర్డ్‌లోని పరిశోధకులు.. క్లాడ్, జెమిని, చాట్‌ జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లను సమీక్షించారు. ఏఐలు డిఫాల్ట్‌గా చాట్ డేటాను ఉపయోగించుకుంటాయని గుర్తించారు. అలాగే కొన్ని కంపెనీలు ఆ డేటాను స్టోర్ చేస్తున్నాయని వీరి పరిశోధనలో తెలిసింది. ఇలా స్టోర్ చేసిన డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఏఐ షేర్ చేసుకోకూడని 8 విషయాలు గురించి తెలుసుకుందాం.

లాగిన్, ఎనకమిక్ వివరాలు

మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు ఉన్న డాక్యుమెంట్‌లను చాట్‌బాట్‌లో ఎప్పుడూ షేర్ చేయకూడదు. సెక్యూర్డ్ పాస్‌వర్డ్‌లను సెట్ చేయడానికి కూడా AI సహాయం తీసుకోవద్దు. ఏఐ చాట్‌బాట్‌లు ఆర్థిక నిపుణులు కాదు, ఏఐ ప్రాంప్ట్‌లలో మీ ఆర్థిక వివరాలు, డ్యాకుమెంట్లు అప్‌లోడ్ చేయకూడదు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ కార్డు నంబర్‌లు, పెట్టుబడి వివరాలు, అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్‌ వివరాలు షేర్ చేయకూడదు. ఈ డేటా స్కామర్ల చేతిలో పడితే మీ ఖాతా ఖాళీ అవుతుంది.

మెడికల్ రిపోర్టులు, వ్యక్తిగత సమాచారం

Advertisement

ఏఐ చాట్‌బాట్‌లు వైద్య నిపుణులు కాదు. కాబట్టి వైద్య సలహా కోసం వాటిపై ఆధారపడకూడదు. మీ మెడికల్ రిపోర్టులను ఏఐతో పంచుకుంటే.. ఆ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. AI ప్రాంప్ట్‌లతో మీ పేరు, అడ్రస్, ఈ-మెయిల్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, సోషల్ సెక్యూరిటీ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్ లేదా మీ ఐడెంటిటీని గుర్తించే డేటాను ఎప్పుడూ షేర్ చేయకూడదు.

ఆరోగ్యం, మెంటల్ హెల్త్ గురించి

మీ హెల్త్ గురించి ఏదైనా సమాచారం ఏఐతో పంచుకోవద్దు. ఉదాహరణకు, గుండెకు మేలు ఆహారం ఏంటని సెర్చ్ చేస్తే ఏఐ చాట్‌బాట్‌లు మీ ఆరోగ్య స్థితిని అంచనా వేస్తాయి. ఈ సమాచారం చివరికి బీమా సంస్థలకు చేరే అవకాశం ఉంది. లైంగిక సమస్యలు, మీరు వాడే మందులు, లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారం కూడా ఏఐతో షేర్ చేయకూడదు. మానసిక ఆరోగ్యాన్ని బాగుచేయడానికి ఏఐ ఏం థెరపిస్ట్ కాదు. మీ మెంటల్ హెల్త్ డేటాను ఏఐ దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంది.

ఫోటోలు, కంపెనీ డాక్యుమెంట్స్

Advertisement

ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ కు ఫేమస్. కానీ వ్యక్తిగత ఫొటోలు ఎప్పుడూ షేర్ చేయవచ్చు. ఇమేజ్ మెటాడేటాలో మీ జీపీఎస్ లొకేషన్ సమాచారం ఉంటుంది. ఈ ఫొటోలు, వివరాలను స్కామర్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కంపెనీ డాక్యుమెంట్లు, ప్రజెంటేషన్‌, ఈ-మెయిల్‌ కోసం ఏఐ ఉపయోగపడుతుంది. కానీ సున్నితమైన కంపెనీ డేటా ఫైల్‌లను చాట్‌బాట్‌లో అప్‌లోడ్ చేస్తే ఆ డేటా స్కామర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. ఏఐ వాడుతుంటే.. సెక్యూరిటీ విషయాలపై దృష్టి పెట్టండి.

Also Read: 6500mAh బ్యాటరీ, AI కెమెరాతో Motorola Edge 70 Pro ఎంట్రీ.. ధర ఎంతంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×