E-Paper
Advertisement

ఘనంగా వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ సినిమా పూజ కార్యక్రమం..కొత్త అధ్యాయం ప్రారంభం అంటూ!

ఘనంగా వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ సినిమా పూజ కార్యక్రమం..కొత్త అధ్యాయం ప్రారంభం అంటూ!
Advertisement

Salman Khan Vamsi Paidipalli: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli)ఒకరు. ఈయన కేవలం టాలీవుడ్ హీరోలతో మాత్రమే కాకుండా ఇతర భాష హీరోలతో కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. చివరిగా వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంశీ పైడిపల్లి ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను డైరెక్టర్ చేయబోతున్నారు.

ముంబైలో పూజ కార్యక్రమాలు పూర్తి..

గత కొంతకాలంగా వీరిద్దరి కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా నేడు ముంబైలో ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారని తెలుస్తుంది. ముంబైలో SRPF గ్రౌండ్ లో పూజా కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడే ఒక ప్రత్యేకమైన సెట్ కూడా వేసారని ఈ సెట్లో ఒక వింటేజ్ సాంగ్ షూటింగ్ కూడా జరగబోతుందని తెలుస్తుంది. రేపటి నుంచి యధావిధిగా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం..

Advertisement

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా నయనతార (Nayanthara)హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎస్ వి సి బ్యానర్ లో 63వ సినిమా కావటం విశేషం. ఇలా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 4వ తేదీ వరకు రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. షూటింగ్ షెడ్యూల్లో భాగంగా ఒక సాంగ్ షూటింగ్ తో పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మరి సల్మాన్ ఖాన్ తో వంశీ పైడిపల్లి ఏ విధమైనటువంటి సినిమాను చేయబోతున్నారు ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే విషయాలు తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలకపాత్రలో నటించబోతున్నారని అదే విధంగా సల్మాన్ ఖాన్ విలన్ గా సౌత్ ఇండియన్ సీనియర్ స్టార్ అరవింద్ స్వామి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ పాత్రలపై చిత్ర బృందం నుంచి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: కళ్ళుచెదిరే రేంజ్ లో జైలర్ 2 ఓటీటీ డీల్.. తలైవా కెరియర్ లోనే హైయెస్ట్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×