E-Paper
Advertisement

కుక్కర్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయెుద్దు.. లేదంటే బ్లాస్ట్ అయిపోద్ది!

కుక్కర్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయెుద్దు.. లేదంటే బ్లాస్ట్ అయిపోద్ది!
Advertisement

Cooker Safety: వంటగదిలో సర్వసాధారణంగా కనిపించే వస్తువుల్లో కుక్కర్ ఒకటి. నిత్యం కుక్కర్ లో ఏదోక వంటకాన్ని మహిళలు చేస్తూనే ఉంటారు. సాధారణ గిన్నెల్లో కంటే కుక్కర్ లో వంటలు చాలా వేగంగా పూర్తి కావడంతో పాటు గ్యాస్ ను సైతం ఆదా చేస్తాయి. అయితే కుక్కర్ వాడేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అది పేలిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రబ్బర్ రింగ్ క్లీనింగ్..

కుక్కర్ మూతకు ఉండే రబ్బర్ రింగ్ సరిగ్గా ఉందో లేదో కుకింగ్ ముందు ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. అది సాగిపోయినా లేదా పగుళ్లు ఇచ్చినా వెంటనే మార్చేయడం బెటర్. రబ్బర్ సరిగ్గా లేకపోతే లోపల ఒత్తిడి (Pressure) బయటకు పోయి ప్రమాదం జరిగే అవకాశముంది.

విజిల్ పైపును శుభ్రత

Advertisement

కుక్కర్ విజిల్ పెట్టే పైపులో ఆహార పదార్థాలు ఇరుక్కుపోకుండా చూసుకోవాలి. ప్రతిసారీ వంట చేసే ముందు ఆ రంధ్రం గుండా గాలి ధారాళంగా వెళ్తుందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ అది బ్లాక్ అయి ఉంటే లోపల గాలి ఒత్తిడి పెరిగి కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది.

తగినంత నీరు

కుక్కర్ పోసే నీటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కుక్కర్‌ను ఎప్పుడూ నిండుగా నింపకూడదు. పప్పు లేదా బియ్యం వేసినప్పుడు కుక్కర్‌లో 2/3 వంతు మాత్రమే నీరు పోయాలి. ముఖ్యంగా పొంగే పదార్థాలు వండేటప్పుడు సగం వరకు మాత్రమే నింపడం మంచిది. అలాగనీ నీటిని మరి తక్కువగా పోస్తే అడుగు మాడిపోయి సేఫ్టీ వాల్వ్ కరిగిపోయే అవకాశం ఉంది.

విజిల్ ఎత్తేటప్పుడు జాగ్రత్త

Advertisement

వంట పూర్తయిన వెంటనే బలవంతంగా విజిల్ ఎత్తి గాలిని తీయడానికి ప్రయత్నించకండి. లోపల ప్రెషర్ దానంతట అదే తగ్గే వరకు కనీసం 10-15 నిమిషాలు వేచి ఉండండి. ఒత్తిడి ఉన్నప్పుడు మూతను బలవంతంగా తీయడం, విజిల్ నుంచి ఆవిరిని స్వయంగా పంపించే ప్రయత్నం చేస్తే అది ఒక్కసారిగా పేలిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌‌లో ‘జేమ్స్ బాండ్ స్ట్రీట్’ ఉందా? ఇదిగో ఇక్కడ ఉందట, కానీ..

సేఫ్టీ వాల్వ్

కుక్కర్ మూతకు కింద ఉండే సేఫ్టీ వాల్వ్ పాతబడినా, తుప్పు పట్టినా వెంటనే మార్చేయాలి. అధిక ఒత్తిడి ఏర్పడినప్పుడు విజిల్ పనిచేయకపోతే ఈ సేఫ్టీ వాల్వ్ పేలిపోయి గాలిని బయటకు పంపే అవకాశముంది.

Also Read: రూ.8,400 కోట్ల నగదు.. అందగత్తెను భార్యగా ఇవ్వండి.. ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×