// // Portable Safety Plug Adapter: గీజర్ షార్ట్ సర్క్యూట్‌ను ఆపే అద్భుతమైన గ్యాడ్జెట్స్ ఇవే..ఈ రెండు తప్పకుండా మీ ఇంట్లో ఉండాల్సిందే! -->
E-Paper
Advertisement

Portable Safety Plug Adapter: గీజర్ షార్ట్ సర్క్యూట్‌ను ఆపే అద్భుతమైన గ్యాడ్జెట్స్ ఇవే..ఈ రెండు తప్పకుండా మీ ఇంట్లో ఉండాల్సిందే!

Portable Safety Plug Adapter: గీజర్ షార్ట్ సర్క్యూట్‌ను ఆపే అద్భుతమైన గ్యాడ్జెట్స్ ఇవే..ఈ రెండు తప్పకుండా మీ ఇంట్లో ఉండాల్సిందే!
Advertisement

Portable Safety Plug Adapter: చలికాలం వచ్చిందంటే చాలు.. వేడి వేడి నీళ్లతో స్నానం చేసేందుకు అందరం గీజర్లను ఉపయోగిస్తాం. అయితే, కొన్నిసార్లు బాత్‌రూమ్ ట్యాప్ తిప్పగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. మనం దానిని చిన్న సమస్యగా భావిస్తాం కానీ. ఆ చిన్న లీకేజీయే పెద్ద ప్రమాదానికి సంకేతం. గీజర్ లోని ఎలక్ట్రిక్ కాయిల్ దెబ్బతిన్నప్పుడు నీటి ద్వారా కరెంట్ సరఫరా అవుతుంది. ఇది ప్రాణాపాయకరమైన షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు. అందుకే.. ఆ ప్రమాదం నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గీజర్ ప్రమాదాల నుంచి రక్షణ.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు:

Advertisement

చలికాలంలో గీజర్ వాడకం చాలా ఎక్కువ. గీజర్ పాతబడటం వల్ల లేదా లోపల ఉండే హీటింగ్ ఎలిమెంట్ (కాయిల్) తుప్పు పట్టడం వల్ల విద్యుత్ నీటిలోకి లీక్ అవుతుంది. ఈ కరెంట్ పైపుల ద్వారా బాత్‌రూమ్ ట్యాప్‌ల వరకు చేరుతుంది. దీనిని నివారించడానికి , ప్రాణాలను కాపాడుకోవడానికి ఆధునిక సాంకేతికత కొన్ని అద్భుతమైన పరిష్కారాలను అందిస్తోంది.

1. పోర్టబుల్ సేఫ్టీ ప్లగ్ అడాప్టర్ (PRCD): చాలామంది గీజర్లను సాధారణ ప్లగ్ పాయింట్‌లకు కలుపుతారు. దీనికి బదులుగా Havells PRCD వంటి సేఫ్టీ ప్లగ్ అడాప్టర్‌ను వాడటం ఉత్తమం.

Advertisement

ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ ప్లగ్ విద్యుత్ ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. గీజర్ లో ఎక్కడైనా చిన్న కరెంట్ లీకేజీ జరిగినట్లు ఇది గుర్తిస్తే, క్షణంలో (మిల్లీ సెకన్లలో) పవర్ సప్లైని నిలిపివేస్తుంది. ఎంసిబి (MCB) ట్రిప్ అయ్యేలోపే ఇది కరెంట్ నిలిపివేయడం వల్ల మీకు షాక్ తగిలే అవకాశం ఉండదు. ఇది అమర్చడం చాలా సులభం, ఖర్చు కూడా తక్కువ.

2. యాంటీ-ఎలక్ట్రిక్ సేఫ్టీ వాల్వ్స్ : గీజర్ నుంచి వచ్చే నీటి పైపుల ద్వారా కరెంట్ రాకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి.

ఇది ఎలా పనిచేస్తుంది?:

గీజర్ యొక్క ఇన్లెట్ (నీరు వచ్చే పైపు), అవుట్‌లెట్ (నీరు వెళ్లే పైపు) వద్ద వీటిని అమర్చాలి. ఇవి గీజర్ కి , బాత్‌రూమ్ ట్యాప్‌లకు మధ్య ఒక ఇన్సులేషన్ గోడలా పనిచేస్తాయి. అంటే.. గీజర్ లో కరెంట్ ఉన్నా, ఈ వాల్వ్ దాటి నీటి ద్వారా కరెంట్ బయటకు రాదు.

లాభం: ఈ వాల్వ్స్ కేవలం కరెంట్ ఆపడమే కాకుండా, నీటిలో ఉండే మలినాలను కూడా ఫిల్టర్ చేస్తాయి. దీనివల్ల గీజర్ లోపల ఉప్పు పేరుకుపోకుండా ఉంటుంది.

3. ఎర్తింగ్ :

మీ ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోయినా కరెంట్ షాక్ కొడుతుంది. చలికాలం మొదలయ్యే ముందే ఒక ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి బాత్‌రూమ్ సాకెట్లు, గీజర్ వైరింగ్‌ను చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పాత ఇళ్లలో వైరింగ్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read: ఈ రేంజ్‌‌లో ఫీచర్లా ? వన్ ప్లస్ 16 లీక్డ్ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే!

4. స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:

గీజర్ ఆఫ్ చేయడం: చాలామంది గీజర్ ఆన్ లో ఉండగానే స్నానం చేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం. నీరు వేడెక్కిన తర్వాత గీజర్ స్విచ్ ఆఫ్ చేసి, ఆపై స్నానం చేయడం అత్యంత సురక్షితమైన పద్ధతి.

తేమ లేని చేతులతో స్విచ్ వేయడం: గీజర్ స్విచ్ లు ఎప్పుడూ పొడి చేతులతోనే వేయాలి. బాత్‌రూమ్ బయట స్విచ్ బోర్డు ఉండటం మరింత ఉత్తమం.

ట్యాప్‌లో చిన్న కరెంట్ వస్తోంది కదా అని నిర్లక్ష్యం చేయకండి. అది మీకు ఒక హెచ్చరిక లాంటిది. పైన చెప్పిన PRCD ప్లగ్ , సేఫ్టీ వాల్వ్స్ కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో కూడుకున్నవి, కానీ అవి మీ ప్రాణాలను కాపాడుతాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×