E-Paper
Advertisement

Poco X8 Pro 5G: 9000mAh బ్యాటరీతో పోకో X8 ప్రో సిరీస్ లాంచ్.. ఐరన్ మ్యాన్ ఎడిషన్ అయితే మస్తుంది భయ్యా!

Poco X8 Pro 5G: 9000mAh బ్యాటరీతో పోకో X8 ప్రో సిరీస్ లాంచ్.. ఐరన్ మ్యాన్ ఎడిషన్ అయితే మస్తుంది భయ్యా!
Advertisement

Poco X8 Pro 5G: ప్రముఖ టెక్ సంస్థ షియోమి సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త X8 Pro సిరీస్‌ను విడుదల చేసింది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో Poco X8 Pro 5G, X8 Pro Max 5Gతో పాటు పోకో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఐరన్ మ్యాన్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. మార్చి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సిరీస్‌లో మాక్స్ వేరియంట్ 6.83 అంగుళాల భారీ 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది. దీని 3,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ఇక ప్రో వెర్షన్ 6.59 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతాయి. వీటికి దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం ఐపి రేటింగ్‌లు ఇవ్వడం విశేషం.

Advertisement

Also Read: ఇంట్లోనే ఫ్యామిలీతో మూవీ నైట్.. థియేటర్ ఫీల్ ఇచ్చే బెస్ట్ ప్రొజెక్టర్లు ఇవే!

ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. Pro Max మోడల్‌లో అత్యంత శక్తివంతమైన 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్ వాడారు. సాధారణ Pro మోడల్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్‌ను దీనిలో అమర్చారు. దీనివల్ల భారీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది.

Advertisement

కెమెరా విభాగంలో రెండింటిలోనూ 50MP ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 20MP కెమెరా ఇచ్చారు. ఇక ఈ ఫోన్ల మెయిన్ అట్రాక్షన్ బ్యాటరీ. Pro Maxలో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం మూడ్రోజుల వరకు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రో మోడల్ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. రెండు ఫోన్లు కూడా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

Poco X8 Pro 5G రూ.29,999 నుండి ప్రారంభమవుతుంది. ఐరన్ మ్యాన్ ఎడిషన్ ధర రూ.34,999 కాగా, హై ఎండ్ మోడల్ అయిన Pro Max 5G ధర రూ.39,999 నుండి మొదలవుతుంది. బ్యాంకు ఆఫర్లు కలుపుకుంటే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Also Read: రీల్స్, షార్ట్స్‌‌లోని మూవీ క్లిప్స్‌ పోస్టుల్లో సినిమా పేర్లు ఎందుకు చెప్పరు? ఇంత కుట్ర ఉందా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×