E-Paper
Advertisement

Sreeleela: మహేష్ వివాదం… క్లారిటీ ఇచ్చిన శ్రీలీల..రూమర్లకు చెక్ పెట్టిందా?

Sreeleela: మహేష్ వివాదం… క్లారిటీ ఇచ్చిన శ్రీలీల..రూమర్లకు చెక్ పెట్టిందా?
Advertisement

Sreeleela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం’ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరి కొన్ని గంటలలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు సమయం లేకపోవడంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్లు కూడా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి శ్రీలీలకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

మహేష్ వద్ద శ్రీలీల ఫోన్…

ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా శ్రీ లీల నటుడు మహేష్ అచంటకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవడంతో అసలు ఏం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఇక ఈ వీడియో పట్ల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో పై మహేష్ క్లారిటీ ఇచ్చారు. శ్రీ లీల అలా సీరియస్ గా చూడటానికి గల కారణం ఏంటి అంటూ వస్తున్న వార్తలపై మహేష్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. శ్రీ లీల ఫోన్ తన దగ్గర ఉండిపోయిందని ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫోన్ గురించి అడుగుతున్నారానుకున్నా అంతలోపే ఆమె వెనుక ఉన్న స్క్రీన్ వైపు చూసింది. అంతకుమించి ఇక్కడ ఏమి జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

వైరల్ వీడియో పై శ్రీ లీల క్లారిటీ..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ లీలకు ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా శ్రీ లీల స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్న సమయంలో అందరం ఆ స్పీచ్ వింటున్నాము. అయితే వెనకనుంచి ఏదో సౌండ్ వస్తున్నట్లు అనిపిస్తే వెనక్కి తిరిగి చూసాను. అయితే నా ఫోన్ తన దగ్గర ఉండటంతో ఫోన్ కోసమే తిరగానని ఆయన, ఏదో శబ్దం వస్తుందని నేను వెనక్కి తిరిగి చూసాము అంతే తప్ప అక్కడ ఏమీ జరగలేదని అయితే కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం అంటూ శ్రీ లీల ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడం ఈ వీడియో పట్ల వచ్చిన వార్తలు కాస్త బాధ కలిగించాయని తెలిపారు.

పోలీస్ ఆఫీసర్ గా పవన్..

Advertisement

ఇలా ఈ వీడియో గురించి అటు మహేష్ అచంట, ఇటు శ్రీలీల కూడా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో వీడియోకి పూర్తిగా పులిస్టాప్ పెట్టినట్టే అయ్యింది. ఈ సినిమా విషయానికి వస్తే మార్చి 19 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచాయి. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటించగా మరో కీలక పాత్రలో రాశీ ఖన్నా కూడా నటించిన విషయం తెలిసిందే. నటుడు పార్టీబన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో సందడి చేయనున్నారు.

Also Read: Harish shankar: ఉస్తాద్ భగత్ కోసం శ్రీలీల చాలా వదులుకుంది.. వడ్డీతో సహా తిరిగిస్తాం: హరీష్ శంకర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×