E-Paper
Advertisement

Smartphone Comparison: పోకో X8 ప్రో మాక్స్ vs ఒప్పో రెనో 15C 5G vs రెడ్మి నోట్ 15 ప్రో+ 5G.. మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్స్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: పోకో X8 ప్రో మాక్స్ vs ఒప్పో రెనో 15C 5G vs రెడ్మి నోట్ 15 ప్రో+ 5G.. మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్స్‌లో ఏది బెస్ట్?
Advertisement

Poco X8 Pro Max vs Oppo Reno 15C vs Redmi Note 15 Pro+ Smartphone Comparison| మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీమియం ఫీచర్స్ ఉన్న పోకో X8 ప్రో మాక్స్ 5G ఇటీవలే లాంచ్ అయింది. ఈ ఫోన్‌కు పోటీగా మార్కెట్లో ఒప్పో రెనో 15C 5G, రెడ్మి నోట్ 15 ప్రో+ 5G ఫోన్లు ఉన్నాయి. ఈ మూడు ఫోన్లు బలమైన ఫీచర్లతో విడుదలయ్యాయి. కానీ ప్రతి ఫోన్ వేర్వేరు యూజర్ల అవసరాలకు సరిపోతాయి. ఏది కొనాలో మీ బడ్జెట్, గేమింగ్, కెమెరా లేదా బ్యాటరీ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

పోకో X8 ప్రో మాక్స్.. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.42,999కి లభిస్తుంది. 12GB ర్యామ్ + 512GB వేరియంట్ ధర రూ.46,999.
ఒప్పో రెనో 15C 5G 8GB ర్యామ్ + 256GB ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.37,999.
రెడ్మి నోట్ 15 ప్రో+ 5G 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.37,999.
మూడు ఫోన్లలో పోకో అత్యంత ఖరీదైన ఆప్షన్. ఒప్పో అతి తక్కువ ధరలో ఉంది.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

పోకోలో 6.83 ఇంచ్ 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
ఒప్పో రెనో 15C లో 6.57 ఇంచ్ ఆమోలెడ్ డిస్‌ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రేట్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.
రెడ్మి ఫోన్ కూడా 6.83 ఇంచ్ 1.5K AMOLED, 120Hz, 3200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
మూడింటిలో పోకో డిస్‌ప్లే అత్యంత బ్రైట్‌గా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్, యూజర్ ఎక్స్‌పీరియన్స్

పోకో X8 ప్రో మాక్స్ ఆండ్రాయిడ్ 16తో HyperOS 3 ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది.
ఒప్పో ఆండ్రాయిడ్ 16తో ColorOS 16 ఇస్తుంది.
రెడ్మి ఆండ్రాయిడ్ 15తో HyperOS 2 ఉపయోగిస్తుంది.
పోకో, ఒప్పో అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌తో ముందున్నాయి.

పనితీరు, ప్రాసెసర్

Advertisement

పోకో X8 ప్రో మాక్స్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో బలంగా ఉంటుంది.
ఒప్పో రెనో 15Cలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఉంది. బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్, ఎఫిషియెన్సీ ఇస్తుంది.
రెడ్మిలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ఉంది. ఒప్పో కంటే మెరుగైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది కానీ పోకో పర్‌ఫామెన్స్ బెస్ట్. తర్వాత రెడ్మి, చివరగా ఒప్పో.

కెమెరా సెటప్

పోకో ఫోన్‌లో 50MP ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఫొటోలు మంచి డీటెయిలింగ్‌తో తీయడానికి ఉపయోగపడతాయి. ఒప్పోలో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 2MP మ్యాక్రో ఉన్నాయి. రెడ్మి 200MP ప్రైమరీ కెమెరా OISతో ఇస్తుంది. అత్యధిక రిజల్యూషన్ రెడ్మిదే.

ఫ్రంట్ కెమెరా పర్‌ఫామెన్స్

పోకో X8 ప్రో మాక్స్ లో 20MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఒప్పో రెనో 15C లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ ప్రియులకు ఒప్పో బెటర్ ఆప్షన్.
రెడ్మిలో 32MP ఫ్రంట్ కెమెరా బ్యాలెన్స్‌డ్ ఫోటోలు ఇస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

పోకోలో 9000mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
ఒప్పోలో 7000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ ఉంది.
రెడ్మిలో 6500mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యంలో పోకో ముందుంది.

Also Read: ఇంటర్నెట్ లేకున్నా ఫోన్‌లో లైవ్ టీవీ ఛానెల్స్ ఉచితంగా.. కొత్త ఫీచర్ గురూ

కనెక్టివిటీ ఫీచర్లు

మూడు ఫోన్లు 5G, Wi-Fi 6, బ్లూటూత్, NFC వంటి ముఖ్యమైన ఫీచర్లు ఇస్తాయి. రోజువారీ ఉపయోగానికి సరిపోతాయి.

ఏది కొనాలి?

పోకో X8 ప్రో మాక్స్ 5G టాప్ పర్‌ఫామెన్స్, భారీ బ్యాటరీ కావాల్సిన వారికి సరైన ఆప్షన్.
రెడ్మి నోట్ 15 ప్రో+ 5G కెమెరా ఎక్కువగా ఉపయోగించే వారికి బెస్ట్.
ఒప్పో రెనో 15C 5G సెల్ఫీలు, తక్కువ ధర కావాల్సిన వారికి బాగుంటుంది.
మీ అవసరాలు, బడ్జెట్ ప్రకారం ఎంచుకోండి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన మూడు స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్లు, వాటి ధరలు.. ఆయా కంపెనీ ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసేముందు జాగ్రత్తగా చెక్ చేసి కొనుగోలు చేయాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు. ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×