E-Paper
Advertisement

ఈ ధరలో ఇలాంటి ఫీచర్లా? 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌తో Poco M8 Power సెన్సేషన్!

ఈ ధరలో ఇలాంటి ఫీచర్లా? 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌తో Poco M8 Power సెన్సేషన్!
Advertisement

Poco M8 Power: పోకో నుంచి త్వరలోనే ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి రాబోతోంది. Poco M8 Power పేరుత వస్తున్న ఈ హ్యాండ్ సెట్‌ను ఆగస్టు 4న లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీనే. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ గంటలు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

డిజైన్, లుక్ ఎలా ఉండబోతోంది?

లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన పేజీ కూడా ప్రత్యక్షమైంది. ఈ టీజర్ల ప్రకారం ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో ఉండే కెమెరా మాడ్యూల్, దానికి తోడు ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ ఫోన్‌ను ఆరెంజ్ రంగులో ప్రదర్శించారు. లాంచ్ సమయంలో మరిన్ని రంగుల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో డిస్‌ప్లే కూడా నాణ్యమైన AMOLEDతో రానుంది.

Advertisement

Also Read: 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వివో V70 FE 5G పై ఊహించని ప్రైస్ డ్రాప్!

మూడ్రోజుల బ్యాటరీ బ్యాకప్:

ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం దీనిలోని 8000mAh బ్యాటరీ. సాధారణ వాడకంలో ఈ బ్యాటరీ ఏకంగా మూడు రోజుల పాటు వస్తుందని పోకో పేర్కొంది. నిరంతరం గేమింగ్ ఆడేవారికి, ట్రావెలింగ్ చేసేవారికి, రోజంతా వీడియోలు చూసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్‌గా మారనుంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

రెడ్‌మీ నోట్ 17కి రీబ్రాండ్‌గా?

Advertisement

కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ.. ఇది ఇటీవలే చైనాలో విడుదలైన Redme Note 17 మోడల్‌కి రీబ్రాండ్‌గా వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే నిజమైతే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ధర, ఇతర వేరియంట్ల సమాచారం ఆగస్టు 4 లాంచ్ రోజున అధికారికంగా తెలియనుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రోజులు వచ్చే బ్యాటరీ ఫోన్ కోసం చూసేవారికి ఇది మంచి ఎంపిక కావచ్చు.

Also Read: వచ్చేస్తోంది iPhone 18 Pro సిరీస్.. లాంచ్ డేట్ ఫిక్స్ అయింది కానీ, ఈ ఫోన్ రేటును తట్టుకోవడమే కష్టమే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×