E-Paper
Advertisement

Phone Overheating: గేమింగ్, చార్జింగ్ సమయంలో కాలిపోతున్న ఫోన్లు.. ఈ జాగ్రత్తలు పాటించండి

Phone Overheating: గేమింగ్, చార్జింగ్ సమయంలో కాలిపోతున్న ఫోన్లు.. ఈ జాగ్రత్తలు పాటించండి
Advertisement

Phone Overheating Gaming| స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం సాధారణ సమస్య. కానీ ఇలా తరుచూ జరుగుతోందంటే ఫోన్ డ్యామేజ్ అవుతున్నట్లే. ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. గేమింగ్, చార్జింగ్ చేసే సయయ్తో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ యాప్‌లు రన్ అవ్వడం వల్ల ఇలా ఫోన్లు వేడెక్కుతాయి. ఎక్కువ సమయం ఫోన్ జేబులో పెట్టుకోవడం, ఎండలో ఉంచడం కూడా ఇందుకు కారణాలు. సమస్య ఇలాగే కొనసాగితే ఫోన్లు కాలిపోవచ్చు.. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు. అందుకే ఈ సమస్యను నివారించడానికి కొన్ని సులభమైన టిప్స్ మీ కోసం.

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి

ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. యాప్‌లను కూడా తప్పకుండా అప్‌డేట్‌ చేయాలి. అప్‌డేట్‌లు బ్యాటరీని మెరుగ్గా ఉపయోగించేలా చేస్తాయి. ఫోన్ పనితీరును మెరుగుపరుస్తాయి. పాత సాఫ్ట్‌వేర్ వల్ల గ్లిచ్‌లు వస్తాయి. అవి ప్రాసెసర్‌పై ఒత్తిడి పెంచి వేడిని పుట్టిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ తాజా వెర్షన్‌లో ఫోన్ కండీషన్ లో ఉండాలి.

బ్యాక్ గ్రౌండ్ యాప్‌లను మూసివేయండి

Advertisement

యాప్ ఉపయోగించడం అయిపోతే.. వాటిని పూర్తిగా మూసివేయండి. బ్యాక్ గ్రౌండ్‌లో చాలా యాప్‌లు రన్ అవుతూ.. నెట్‌వర్క్, ప్రాసెసర్‌ను ఉపయోగిస్తాయి. ఇది సీపీయూపై ఒత్తిడి పెంచి ఫోన్ హీట్ ని పెంచుతుంది. బ్యాటరీ సెట్టింగ్స్‌లో చూసి ఎక్కువ బ్యాటరీ తినే యాప్‌లను గుర్తించండి. అవసరమైతే వాటిని ఫోర్స్ స్టాప్ చేయండి.

చార్జింగ్ సమయంలో ఫోన్ లో భారీ పనులు చేయకూడదు

చార్జింగ్‌లో ఉన్నప్పుడు గేమింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేయకండి. సాధారణంగా చార్జింగ్ వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. కానీ అదే సమయంలో వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం వంటివి చేస్తే ప్రాసెసర్‌ను ఎక్కువగా వినియోగించబడుతుంది. ఈ కారణంగా ఫోన్ మొత్తం వేడెక్కిపోతుంది. ఇది ప్రమాదకరం కావచ్చు. ఫోన్ పూర్తిగా చార్జ్ అయ్యాకే మళ్లీ ఉపయోగించండి.

ఎండ, వేడి నుంచి దూరంగా ఉంచండి

Advertisement

ఫోన్‌ను ఎండలో లేదా వేడి కారులో పెట్టకండి. గాలి ప్రసరణ లేకపోతే ఫోన్ చల్లబడలేదు. ఇప్పటి ఫోన్‌లలో వేడి ఎక్కువైతే ఆటోమాటిక్‌గా ఆఫ్ అయ్యే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ చేసే సమయంలో ఫోన్ చల్లని ప్రదేశంలో ఉండాలి లేదా గాలి బాగా ఆడుతూ ఉండాలి. ఫోన్ ని బెడ్ కింద కూడా దాచకూడదు. అలా చేసినా ఫోన్ త్వరగా వేడెక్కిపోతుంది.

ఫోన్ ని చల్లబర్చే ఇతర మార్గాలు

గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కితే కవర్ తీసేయండి. గాలి స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఇవ్వండి. ఫోన్‌ను గట్టి, చదునైన ఉపరితలంపై పెట్టండి. వేడి త్వరగా తగ్గిపోతుంది. తక్కువ క్వాలిటీ లేదా చౌక ఛార్జర్లు ఉపయోగించకండి. వాటి వల్ల కూడా ఫోన్ వేడెక్కి పోతుంది. ఫోన్ బ్యాటీరీ త్వరగా డ్యామేజ్ అవుతుంది.

ఫోన్ ఆరోగ్యాన్ని గమనించండి

ఫోన్ అసాధారణంగా వేడెక్కితే గమనించండి. వేడిగా అనిపిస్తే కొంచెం విశ్రాంతి ఇవ్వండి. రీస్టార్ట్ చేయడం వల్ల టెంపరరీ ఫైల్స్ క్లియర్ అవుతాయి. వేడి సమస్య కొనసాగితే ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఇది సాఫ్ట్‌వేర్ సమస్యలను తొలగిస్తుంది.

ఈ సులభమైన అలవాట్లు మీ ఫోన్‌ లైఫ్ ని పెంచుతాయి. ఫోన్ పనితీరు మెరుగవుతుంది. ఈ టిప్స్‌ను ఇప్పటి నుంచే అమలు చేయండి.

Also Read: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×