E-Paper
Advertisement

ఇంట్లోనే Vitamin-D అందించే Philips సీలింగ్ లైట్.. ఫీచర్లు అద్భుతం కానీ, ఆ ఒక్కటే మైనస్!

ఇంట్లోనే Vitamin-D అందించే Philips సీలింగ్ లైట్.. ఫీచర్లు అద్భుతం కానీ, ఆ ఒక్కటే మైనస్!
Advertisement

Philips Ceiling Light: ఇంట్లో కూర్చున్నా సరే.. ఆకాశం నుంచి వచ్చే సహజమైన సూర్యకాంతిని ఆస్వాదించగలిగితే ఎంత బాగుంటుందో కదా! ఇప్పుడు ఇలాంటి అనుభూతినే అందించడానికి ప్రముఖ హోమ్ లైటింగ్ బ్రాండ్ ‘ఫిలిప్స్’ ఒక సరికొత్త సీలింగ్ లైట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని పేరు ‘ఫిలిప్స్ స్కైలైట్’. గదిలో కిటికీలు లేకపోయినా, ఇంట్లో మంచి స్కైలైట్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేనివారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం.

ప్రకృతికి దగ్గరగా..

ఈ స్కైలైట్ కేవలం వెలుతురును మాత్రమే కాదు.. రోజంతా సూర్యుని కాంతిలో వచ్చే మార్పులను కూడా అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. దీనికోసం ఇందులో ప్రత్యేకమైన ఎల్‌ఈడీ, నేచర్‌కనెక్ట్ టెక్నాలజీలను వాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట వాతావరణానికి తగ్గట్టుగా ఇది తన బ్రైట్‌నెస్, కలర్ టెంపరేచర్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. దీనివల్ల మనం ఇంట్లోనే ఉన్నా సరే, ప్రకృతి ఒడిలో ఉన్న భావన కలుగుతుంది.

Advertisement

Also Read: 800W పవర్, డాల్బీ ఆడియో.. తక్కువ ధరలో iBall తెచ్చిన సరికొత్త Cinebar 560!

విటమిన్-డి కూడా లభిస్తుంది..

ఈ సరికొత్త లైనప్‌లో మీడియం, లార్జ్ వేరియంట్లతో పాటు VitaUp అనే ప్రత్యేక మోడళ్లను కూడా ఫిలిప్స్ పరిచయం చేసింది. ఈ విటాఅప్ మోడళ్లలో బిల్ట్‌ఇన్ UV-B మాడ్యూల్ ఉంటుంది. ఇది మన శరీరం సహజంగా విటమిన్-డి‌ని తయారు చేసుకోవడానికి సహాయపడుతుంది. భద్రత కోసం దీనిలో ఎనిమిది గంటల తర్వాత ఆటోమేటిక్‌గా లైట్ ఆఫ్ అయ్యే ఫీచర్‌ను కూడా అందించారు.

స్మార్ట్ ఫీచర్లు లేకపోవడం పెద్ద లోటు:

Advertisement

ఈ లైట్ డిజైన్, టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ.. దీని ధర దాదాపు రూ.45,000 నుండి ప్రారంభమవుతుంది. ఇంత భారీ ధర ఉన్నప్పటికీ.. ఇందులో వై-ఫై, మ్యాటర్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు లేకపోవడం నిజంగా నిరాశపరిచే విషయమే. ఇది ఫిలిప్స్ Hue సిరీస్ ఉత్పత్తి కాదు. కాబట్టి దీన్ని మన స్మార్ట్ హోమ్ సెటప్‌కు కనెక్ట్ చేయలేం. కేవలం దీనితో వచ్చే రిమోట్ ద్వారా మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది.

కొనుగోలు చేయొచ్చా?

మొత్తానికి, ఇంట్లోనే ఉంటూ మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని పొందాలనుకునే వారికి ఈ ఫిలిప్స్ స్కైలైట్ ఒక సూపర్ ఆప్షన్. అయితే, ఇంత ప్రీమియం ధర పెట్టినప్పుడు స్మార్ట్ ఫీచర్లు కూడా ఉండి ఉంటే మరింత బాగుండేది. భవిష్యత్తులో వచ్చే మోడళ్లలోనైనా ఫిలిప్స్ ఈ స్మార్ట్ కనెక్టివిటీని జోడిస్తుందని ఆశిద్దాం.

Also Read: కొత్త ఫోన్‌కు పాత ఛార్జర్ వాడుతున్నారా? PPS టెక్నాలజీ గురించి తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యరు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×