E-Paper
Advertisement

Jio Rs 195 vs Rs 200 Plan: రూ.5 తేడాతో డబుల్ డేటా.. యూట్యూబ్ ప్రీమియం, 15 ఓటీటీలు ఉచితం!

Jio Rs 195 vs Rs 200 Plan: రూ.5 తేడాతో డబుల్ డేటా.. యూట్యూబ్ ప్రీమియం, 15 ఓటీటీలు ఉచితం!
Advertisement

Jio Rs 195 vs Rs 200 Plan: రిలయన్స్ జియో (Reliance Jio) ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా అదనపు డేటా, ఓటీటీ (OTT) ప్రియుల కోసం జియో ప్రవేశపెట్టే డేటా వోచర్లు మార్కెట్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన రూ.195, రూ.200 ప్రీపెయిడ్ ప్లాన్స్.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య కేవలం రూ. 5 మాత్రమే వ్యత్యాసం ఉండటం చర్చకు తావిస్తోంది. ఆ ఐదు రూపాయలు అదనంగా ఖర్చు చేయడం వల్ల యూజర్లకు లభించే బెనిఫిట్స్? రెండు ప్లాన్ల వివరాలు? రూ. 200 ప్లాన్ ఎందుకు బెస్టో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూ. 195 ప్లాన్ బెనిఫిట్స్

జియో అందిస్తున్న రూ. 195 ప్లాన్.. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ డేటా ప్యాక్. క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని దీనిని జియో తీసుకొచ్చింది. ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు మొత్తం 15 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే జియో హాట్ స్టార్ కు సంబంధించి 90 రోజుల ఫ్రీ సబ్ స్క్రిప్షన్ లభించనుంది. ఈ ప్యాక్ 30 రోజుల పాటు యాక్టివ్ గా ఉంటుంది. హాట్ స్టార్ ను మాత్రం 90 రోజుల పాటు చూడొచ్చు.

రూ. 200 ప్లాన్ సంగతేంటి?’

Advertisement

ఓటీటీ పాస్ పేరుతో ఇటీవల ఈ ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. కేవలం రూ. 5 అదనంగా పెట్టడం ద్వారా ఇందులో అద్భుతమైన ప్రయోజనాలను యూజర్ పొందొచ్చు. రూ. 195 ప్లాన్‌లో 15 GB డేటా వస్తే.. ఈ రూ. 200 ప్లాన్‌లో ఏకంగా 30 GB డేటా యూజర్ కు లభించనుంది. అంటే సరిగ్గా డబుల్ డేటా అన్నమాట. అంతేకాకుండా యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 లతో పాటు మొత్తం 15 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు. అదే విధంగా జియో టీవీ యాప్ ద్వారా 150కి పైగా పెయిడ్ ఛానెళ్లతో కలిపి మొత్తం 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసే అవకాశం యూజర్ కు లభించనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ కంటెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్.. ఏసీ పెట్టేందుకు నిరాకరిస్తే.. ఓనర్లకు రూ.94,904 జరిమానా!

నో కాల్స్, నో SMSలు

Advertisement

అయితే పైన పేర్కొన్న రెండు ప్లాన్స్ కేవలం ఓటీటీ, డేటాను ఉద్దేశించి మాత్రమే తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో ఫ్రీకాల్స్, ఎస్ఎంఎస్ సేవలు లభించవు. ఒకవేళ అవి కూడా కావాలని భావిస్తే.. సెపరేట్ యాడ్ ఆన్ ప్లాన్స్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వర్గాలు వెల్లడించాయి. కాగా, మీకు కేవలం జియోహాట్‌స్టార్ మాత్రమే కావాలి అనుకుంటే రూ. 195 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కంప్లీట్ ఆల్ రౌండ్ ఓటీటీ ప్యాక్ కోరుకుంటే రూ.5 ఎక్స్ ట్రా పెట్టి రూ.200 ప్లాన్ చేసుకోవడం మంచిది.

Also Read: Smart Glasses: కంటిపై లెన్స్, ముఖానికి అద్దాలు.. తర్వాత జరిగే అద్భుతమే వేరు..!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×