E-Paper
Advertisement

Phillips Smartphone India: భారత మొబైల్ మార్కెట్‌లోకి ఫిలిప్స్ ఎంట్రీ.. వివో, ఒప్పో, షావోమీకి దబిడి దిబిడే

Phillips Smartphone India: భారత మొబైల్ మార్కెట్‌లోకి ఫిలిప్స్ ఎంట్రీ.. వివో, ఒప్పో, షావోమీకి దబిడి దిబిడే
Advertisement

Phillips Smartphone India| ఫిలిప్స్ కంపెనీ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేయబోతోంది. బడ్జెట్ జీవుల కోసం తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లను ఫిలిప్స్ తీసుకురానుంది. ఫిలిప్స్ లాంటి భారీ కంపెనీ అరంగ్రేటంతో ఒప్పో, వన్‌ప్లస్, వివో, షావోమీ లాంటి చైనా బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ మార్కెట్‌లో ఫిలిప్స్ కంపెనీ పెద్ద వాటా సంపాదించాలని భావిస్తోంది.

జెనోటెల్‌తో భాగస్వామ్యం

ఫిలిప్స్ ఈ లాంచ్ కోసం జెనోటెల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. భారతీయ కంపెనీ జెనోటెల్ దేశంలో అమ్మకాలు, పంపిణీ చూసుకుంటుంది. ఫిలిప్స్ కంపెనీ తయారు చేసే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను దేశంలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అలాగే స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా విక్రయిస్తారు. ఫిలిప్స్ ఇప్పటికే భారత్‌లో టీవీలు వంటి గృహోపకరణాలు అమ్ముతోంది. ఇప్పుడు వ్యక్తిగత టెక్ ఉత్పత్తుల్లోకి అడుగుపెడుతోంది.

ఫిలిప్స్ ప్యాడ్ ఎయిర్ ట్యాబ్ లీక్

Advertisement

ఫిలిప్స్ కొత్త టాబ్లెట్ గురించి ఆన్ లైన్ లో లీక్స్ వచ్చాయి. దీని పేరు ఫిలిప్స్ ప్యాడ్ ఎయిర్. ఇందులో యూనిసాక్ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ ఉంటాయి. డిస్‌ప్లే చాలా బాగుంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో పోటీదారుల కంటే మెరుగైనది. అలాగే 2కే రిజల్యూషన్ ఉండటంతో ఫొటో, వీడియోలు స్పష్టంగా కనిపిస్తాయి.

పెద్ద బ్యాటరీ, లాంచ్ సమయం

ఫిలిప్స్ ప్యాడ్ ఎయిర్‌లో 7000 mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీంతో ఎక్కువ సమయం వాడుకోవచ్చు. 18 వాట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. కంపెనీ వచ్చే ఏడాది మొదటి నెలల్లో ఈ ఉత్పత్తిని విడుదల చేయవచ్చు. ముందు టాబ్లెట్‌లు వస్తాయి, తర్వాత స్మార్ట్‌ఫోన్లు వస్తాయి. ఫోన్ల గురించి ఇంకా వివరాలు రాలేదు. త్వరలోనే మరిన్ని విషయాలు తెలుస్తాయి.

చైనా బ్రాండ్లతో పోటీ

Advertisement

భారత మార్కెట్‌లో గత కొంత కాలంగా చైనా బ్రాండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. షావోమీ, ఒప్పో, వివో వంటి కంపెనీలు చవక ధరల్లో మంచి ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. వీటి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లకు భారతీయులు అలవాటు పడ్డారు. ఫిలిప్స్ కూడా తక్కువ ధరల్లో మంచి ఫీచర్లు ఇచ్చి ఈ బ్రాండ్లను ఎదుర్కోబోతోంది. దీని విజయం.. డివైజ్ ధర, పనితనం, యూజర్ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. చవక సెగ్మెంట్‌లో పోటీ మరింత తీవ్రమవుతుంది.

భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇదే

025 మూడో త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 5 శాతం పెరిగింది, వాల్యూ 18 శాతం ఎగసింది. వివో 20 శాతం షేర్‌తో మొదటి స్థానం దక్కించుకుంది. శాంసంగ్ 13 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. ఆపిల్ మొదటిసారి టాప్-5లోకి (9 శాతం) వచ్చింది. ఓప్పో 13 శాతం, రియల్‌మీ 9 శాతం, షావోమీ 8 శాతం. iQOO 54 శాతం, మోటోరోలా 53 శాతం, లావా 135 శాతం పెరిగాయి. ప్రీమియం సెగ్మెంట్ 29 శాతం వృద్ధి సాధించింది. మీడియాటెక్ 46 శాతం ప్రాసెసర్ షేర్‌తో ఆధిపత్యం చెలాయిస్తోంది.

Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×