// // Perplexity AI Health| మీ ఇంట్లోనే ఏఐ డాక్టర్.. పర్‌ప్లెక్సిటీలో కొత్త ఏఐ హెల్త్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే? -->
E-Paper
Advertisement

Perplexity AI Health: మీ ఇంట్లోనే ఏఐ డాక్టర్.. పర్‌ప్లెక్సిటీలో కొత్త ఏఐ హెల్త్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?

Perplexity AI Health: మీ ఇంట్లోనే ఏఐ డాక్టర్.. పర్‌ప్లెక్సిటీలో కొత్త ఏఐ హెల్త్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?
Advertisement

Perplexity AI Health| ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు పర్సనల్ హెల్త్‌కేర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. పెర్‌ప్లిక్సిటీ (Perplexity) కంపెనీ తమ ఏఐ చాట్‌బాట్‌లో కొత్త ఫీచర్ “పెర్‌ప్లిక్సిటీ హెల్త్” ప్రారంభించింది. ఇది డిజిటల్ హెల్త్ అడ్వైజర్‌లాగా (ఆరోగ్య సలహాదారుడిగా) పనిచేస్తుంది. మీ వ్యక్తిగత మెడికల్ డేటాను విశ్లేషించి సరైన ఆరోగ్య సలహాలు ఇస్తుంది. సాధారణ సమాచారం కాకుండా మీ ఆరోగ్య ప్రొఫైల్ ఆధారంగా స్పెషల్ సలహాలు ఇస్తుందని కంపెనీ తెలిపింది.

పెర్ప్లెక్సిటీ హెల్త్ ఎలా పనిచేస్తుంది?

ఈ టూల్ మీ ఫిట్‌నెస్ డేటాతో కనెక్ట్ అవుతుంది. Fitbit, Withings, Apple Health వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి డేటా తీసుకుంటుంది. మీ యాక్టివిటీ లెవల్, హార్ట్ రేట్, మెడికల్ హిస్టరీ వంటి వివరాలు సేకరిస్తుంది. అడ్వాన్స్ AI మోడల్స్ ద్వారా ఈ డేటాను ప్రాసెస్ చేసి సలహాలు ఇస్తుంది. అయితే జనరిక్ సమాధానాలు ఇవ్వదు. మీ పూర్తి ఆరోగ్య సమాచారం పరిశీలించి మాత్రమే సరైన సలహా ఇస్తుంది.

డేటా సోర్సెస్, ట్రైనింగ్

Advertisement

పెర్‌ప్లిక్సిటీ  ఈ AIని పెద్ద మెడికల్ డేటాసెట్‌లతో ట్రైన్ చేసింది. హాస్పిటల్ రికార్డులు, క్లినికల్ ఇన్‌ఫర్మేషన్, ల్యాబ్ రిపోర్టులు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులు ఉపయోగించారు. సుమారు 1.7 మిలియన్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ డేటా ఉపయోగించారు. మెడికల్ జర్నల్స్, క్లినికల్ గైడ్‌లైన్స్ కూడా రిఫర్ చేస్తుంది. దీంతో సలహాలు స్టాండర్డ్ మెడికల్ ప్రాక్టీస్‌లకు అనుగుణంగా ఉంటాయి.

పెర్ప్లెక్సిటీ హెల్త్ ఏఐ ఉదాహరణ

ఒక యూజర్ తన హార్ట్ రేట్ గురించి అడిగితే AI లోతుగా విశ్లేషిస్తుంది. మీ ఎక్సర్‌సైజ్ హిస్టరీ చూస్తుంది. ఇటీవలి బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ రివ్యూ చేస్తుంది. అన్ని డేటా చూసి పర్సనలైజ్డ్ సమాధానం ఇస్తుంది. ఇది జనరల్ హెల్త్ టిప్స్ కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మెడికల్ వాలిడేషన్, ఎక్స్‌పర్ట్ రివ్యూ

Advertisement

లాంచ్ ముందు మెడికల్ ఎక్స్‌పర్ట్స్ బోర్డు ఏర్పాటు చేసి సిస్టమ్‌ను టెస్ట్ చేశారు. డాక్టర్లు దీని కచ్చితత్వం, సేఫ్టీని చెక్ చేశారు. దీంతో AI సేఫ్, రిలయబుల్ సలహాలు ఇస్తుందని నిర్ధారణ అయింది. చాలా టెలిహెల్త్ యాప్స్ రియల్ డాక్టర్లపై ఆధారపడతాయి. కానీ పెర్ప్లెక్సిటీ హెల్త్ AI మీదే ఆధారపడుతుంది. ఇదంతా మెడికల్ ప్రొఫెషనల్స్ ట్రైనింగ్‌తో సాధ్యమైంది.

డేటా ప్రైవసీ, సెక్యూరిటీ

పెర్‌ప్లిక్సిటీ  డేటా యూజర్ ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్‌క్రిప్షన్ ఉపయోగించి యూజర్ హెల్త్ డేటాను సురక్షితంగా ఉంచుతుంది. ముఖ్యంగా యూజర్ డేటాను AI ట్రైనింగ్ కోసం ఉపయోగించదు. దీంతో యూజర్ల విశ్వాసం పెరుగుతుంది.

Also Read: ఐఫోన్ నీళ్లలో పడిపోయిందా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయండి

లభ్యత, పరిమితులు

ప్రస్తుతం పెర్‌ప్లిక్సిటీ హెల్త్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రో, ప్రో మ్యాక్స్ యూజర్లకు మాత్రమే ఉపయోగించవచ్చు. ఒక ముఖ్యమైన పరిమితి ఉంది. ఇది రియల్ డాక్టర్ స్థానంలో ఉపయోగించకూడదు. సీరియస్ హెల్త్ సమస్యలకు డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించాలి.

పెర్‌ప్లిక్సిటీ  హెల్త్ డిజిటల్ హెల్త్‌కేర్‌లో పెద్ద అడుగు. వ్యక్తిగత డేటాతో AI కలిపి మెరుగైన ఆరోగ్య సలహాలు ఇస్తుంది. సౌకర్యవంతంగా, పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇస్తుంది. కానీ ఇది సపోర్ట్ టూల్ మాత్రమే. సరైన చికిత్స కోసం డాక్టర్ సలహా తప్పనిసరి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×