E-Paper
Advertisement

Headphones In Fridge: హెడ్‌ఫోన్స్‌లో సమస్య వస్తే ఫ్రిజ్‌లో పెట్టండి.. వైరల్ అవుతున్న వింత ట్రెండ్

Headphones In Fridge: హెడ్‌ఫోన్స్‌లో సమస్య వస్తే ఫ్రిజ్‌లో పెట్టండి.. వైరల్ అవుతున్న వింత ట్రెండ్
Advertisement

Headphones In Fridge| ప్రపంచవ్యాప్తంగా హెడ్‌ఫోన్స్ యూజర్లు ఎక్కువగా ఆపిల్ ఎయిర్ పాడ్స్ అంటే ఇష్టపడతారు. ముఖ్యంగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ మాక్స్ మోడల్ ఉపయోగించే వారు లక్షలామది ఉన్నారు. వీరంతా ఒక వింతమైన ట్రిక్ ప్రయోగిస్తున్నారు – తమ ఖరీదైన హెడ్‌ఫోన్స్‌ను ఫ్రీజర్‌లో పెడుతున్నారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా, సోషల్ మీడియా, రెడ్డిట్, ఇతర ఫోరమ్‌లలో వేలాది మంది దీన్ని షేర్ చేస్తున్నారు. అలా చేస్తే.. తమ హెడ్‌ఫోన్స్ మళ్లీ పనిచేయడం మొదలైందని చెబుతున్నారు. ముఖ్యంగా మొదటి తరం (ఫస్ట్ జనరేషన్) ఎయిర్‌పాడ్స్ మాక్స్‌కు ఈ సమస్య ఎక్కువగా వస్తోంది.

సమస్య ఏమిటి?

ఎయిర్‌పాడ్స్ మాక్స్ హెడ్‌ఫోన్స్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతున్నాయని యూజర్లు తెలిపారు. రీసెట్ చేయడానికి బటన్లు నొక్కితే, లైట్ మూడు సార్లు పసుపు (అంబర్) రంగులో మెరిసి ఆగిపోతుంది. దీన్ని “త్రీ అంబర్ లైట్స్ ఆఫ్ డెత్” అని పిలుస్తారు. ఆ తరువాత నుంచి హెడ్‌ఫోన్స్ బ్లూటూత్‌కు కనెక్ట్ కావడం లేదు. చార్జింగ్ కూడా మధ్యలోనే ఆగిపోతుంది. ఇదంతా హార్డ్‌వేర్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది.

Advertisement

ఈ సమస్యను పరిష్కరించడానికి యూజర్లు ముందు సాధారణ మార్గాలు ప్రయత్నించారు. – రీసెట్ చేయడం, క్లీన్ చేయడం, ఆపిల్ సపోర్ట్ సలహాలు పాటించడం. కానీ ఏవీ పనిచేయలేదు. చివరికి ఫ్రీజర్ ట్రిక్ ని ఉపయోగించి చూస్తున్నారు.

ఫ్రీజర్ ట్రిక్ ఎలా చేయాలి?

హెడ్‌ఫోన్స్‌ను ప్లాస్టిక్ బ్యాగ్‌లో లేదా స్మార్ట్ కేస్‌లో వేసి, తేమ రాకుండా జాగ్రత్త పడుతూ ఫ్రీజర్‌లో 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పెట్టండి. తీసిన తర్వాత గది ఉష్ణోగ్రతకు వచ్చాక, చార్జ్ చేసి రీసెట్ చేయండి. ఆ తరువాత ఆశ్చర్యకరంగా హెడ్ ఫోన్స్ పనిచేస్తున్నాయని చాలా మంది తెలిపారు.

ఇది ఎందుకు పనిచేస్తుంది?

Advertisement

హెడ్‌ఫోన్స్ లోపల సన్నని వైర్లు ఉంటాయి. ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ఆ వైర్లు పగుళ్లు ఏర్పడతాయి లేదా కనెక్షన్ లూజ్ అవుతుంది. చల్లదనం వల్ల మెటల్ కుంచించుకుపోయి, పగుళ్లు తాత్కాలికంగా అంటుకుంటాయి. అందుకే మళ్లీ పనిచేస్తాయి. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు – కొన్ని రోజులు లేదా వారాల తర్వాత మళ్లీ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ప్రమాదాలు కూడా ఉన్నాయి

ఫ్రీజర్‌లో పెడితే తేమ పట్టి హెడ్ ఫోన్స్ షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, బ్యాటరీ డ్యామేజ్ కావచ్చు. ఇలా చేస్తే వారంటీ పోతుందని నిపుణులు హెచ్చరించారు. ఆఫీషియల్ గా సర్వీస్ సెంటర్ లో రిపేర్ చేస్తే చాలా ఖర్చు అవుతుంది. భారత్‌లో ఎయిర్‌పాడ్స్ మాక్స్ ధర రూ.60,000 పైనే ఉంటుంది, రిపేర్ కూడా అంతే ఖర్చు అవుతుంది.

ఆపిల్ ఏమంటోంది?

ఆపిల్ ఇంకా ఈ సమస్యపై అధికారికంగా స్పందించలేదు. రిపేర్ సెంటర్లు ఈ ఫ్రీజర్ మెథడ్ సిఫారసు చేయడం లేదు. అయితే చాలా మంది యూజర్లు ఈ ఖరీదైన ప్రొడక్ట్‌లో ఇంత త్వరగా సమస్య రావడంపై నిరాశ చెందుతున్నారు. అందుకే సొంతంగా సొల్యూషన్లు వెతుక్కుంటున్నారు.

మీరు ఈ ట్రిక్ ట్రై చేస్తారా?

ఎయిర్‌పాడ్స్ మాక్స్‌లో సమస్య కనిపిస్తే.. ముందుగా వారంటీ గురించి చూసుకోండి. వారంటి ఉంటే ముందు ఆపిల్ స్టోర్‌కు వెళ్లండి. వారంటీ లేకపోతే, రిస్క్ తీసుకుని ట్రై చేయవచ్చు. చాలా మందికి పనిచేసింది! కానీ జాగ్రత్తగా, హెడ్ ఫోన్స్‌లో తేమ రాకుండా చూసుకోండి. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే.

Also Read: ముందు ఉపయోగించండి ఆ తరువాతే కొనండి.. ఇండియన్ స్మార్‌ఫోన్ కంపెనీ వింత ఆఫర్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×