E-Paper
Advertisement

Oppo Reno 15 Pro: 200MP కెమెరాగల ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే

Oppo Reno 15 Pro: 200MP కెమెరాగల ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే
Advertisement

Oppo Reno 15 Pro Discount| మంచి కెమెరా ఫోన్స్‌కు ఫేమస్ అయిన ఒప్పో కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఒప్పో రెనో 15. ఈ సిరీస్‌లో హై ఎండ్ మోడల్ అయిన ఒప్పో రెనో 15 ప్రో ఇండియాలో కొన్ని నెలల క్రితమే లాంచ్ అయింది. ఇందులో అడ్వాన్స్‌డ్ కెమెరా, పెద్ద బ్యాటరీతో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లతో చాలా తక్కువ ధరలో దొరుకుతోంది. విజయ్ సేల్స్‌లో లభించే ఈ డీల్, బ్యాంక్ ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూద్దాం.

ఒప్పో రెనో 15 ప్రో ధర, డిస్కౌంట్

ఈ ఫోన్ అసలు MRP రూ.74,999. విజయ్ సేల్స్‌లో 9 శాతం డైరెక్ట్ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. డిస్కౌంట్ తర్వాత కొత్త ధర రూ.67,999. బ్యాంక్ కార్డ్ లేకుండానే ఇన్‌స్టంట్ సేవింగ్ వస్తుంది. ప్రీమియం ఫోన్ కావాలనుకునేవారికి ఇది చాలా అఫోర్డబుల్ అవుతోంది.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు సేవింగ్స్

Advertisement

EMIలో కొనుగోలు చేసేవారికి స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. ICICI బ్యాంక్ కార్డ్‌తో 5 శాతం డిస్కౌంట్ (రూ.3,000) ఉంది. క్రెడిట్, డెబిట్ కార్డ్ EMIలకు వర్తిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 10 శాతం  రూ.6,800) గరిష్ట డిస్కౌంట్. నో-కాస్ట్ EMIలో మాత్రమే వర్కవుతుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌తో గరిష్టంగా 7.5 శాతం (రూ.7,500) డిస్కౌంట్. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆఫర్ గరిష్ట సేవింగ్ ఇస్తుంది.

డిస్‌ప్లే, పెర్ఫామెన్స్

6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ వస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ లాగ్ లేకుండా స్మూత్‌గా జరుగుతాయి. 12GB RAM + 256GB స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 16తో ఒప్పో కస్టమ్ ఇంటర్‌ఫేస్ వస్తుంది.

కెమెరా ఫీచర్లు

Advertisement

కెమెరా ఈ ఫోన్ హైలైట్. 200MP ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్ ఉంది. రెండు 50MP సెన్సార్లు డెప్త్, వైడ్-యాంగిల్ ఫోటోగ్రఫీ మెరుగుపరుస్తాయి. ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. షార్ప్ ఇమేజెస్, షార్ప్ కలర్ కచ్చితత్వం ఇస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, మొబైల్ ఫోటోగ్రఫీ లవర్లకు బెస్ట్.

Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?

బ్యాటరీ, ఛార్జింగ్

6500mAh పెద్ద బ్యాటరీ ఉంది. నార్మల్ యూస్‌లో ఒక రోజు కంటే ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పెద్ద బ్యాటరీ అయినా త్వరగా ఛార్జ్ అవుతుంది. IP69 రేటింగ్‌తో వాటర్, డస్ట్ నుంచి ఫుల్ రెసిస్టెన్స్ ఉంది.

డిస్కౌంట్ ధరలో ఒప్పో రెనో 15 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఇస్తోంది. కెమెరా, బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో హైలైట్ అవుతోంది. బ్యాంక్ ఆఫర్లతో రూ.7,500 వరకు సులభంగా ఆదా చేయవచ్చు. రూ.70,000లో బెస్ట్ ప్రీమియం ఫోన్లలో ఒకటిగా నిలుస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×