E-Paper
Advertisement

ఒప్పో నుంచి బీస్ట్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..

ఒప్పో నుంచి బీస్ట్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..
Advertisement

OPPO K15 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) గేమింగ్ ప్రియులను టార్గెట్ చేస్తూ చైనా మార్కెట్లో సరికొత్త ‘OPPO K15 Pro Plus’ మొబైల్‌ను లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన K13 టర్బో సిరీస్‌కు సక్సెసర్‌గా వచ్చిన ఈ ఫోన్, ఇండియా మార్కెట్లోకి OPPO K15 Turbo Pro అనే పేరుతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు, ప్రత్యేకతలు ఇక్కడ చూద్దాం.

Read also-హీరో రానా గురించి బయటపడ్డ భయంకర నిజం.. ఇది అస్సలు ఊహించిఉండరు..

అల్టిమేట్ గేమింగ్ ఫీచర్లు

Advertisement

ఈ ఫోన్ వెనుక భాగం గ్లాస్ ఫినిషింగ్‌తో, సైడ్స్ మెటల్ ఫ్రేమ్‌తో చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. వైట్, పింక్, గ్రే రంగుల్లో లభించే ఈ ఫోన్ బరువు 214 గ్రాములు ఉంటుంది. ఇది ప్యూర్ గేమింగ్ ఫోన్ కావడం చేత, ఇందులో ఓవర్‌హీటింగ్‌ను తగ్గించడానికి ప్రత్యేకంగా ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్‌ను అమర్చారు. ఫ్యాన్ ఆన్ అయినప్పుడు వినబడేలా రకరకాల కూల్ సౌండ్ ఎఫెక్ట్స్, కస్టమ్ రింగ్టోన్స్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈసారి గేమర్స్ కోసం ప్రత్యేకంగా రైట్ హ్యాండ్ సైడ్ టాప్ భాగంలో గేమింగ్ ట్రిగ్గర్స్ యాడ్ చేశారు. ఫ్యాన్ చుట్టూ అమర్చిన RGB బ్రీతింగ్ లైట్స్ ఫోన్‌కు పక్కా గేమింగ్ లుక్‌ను తీసుకొస్తాయి.

పర్ఫార్మెన్స్

ఈ మొబైల్‌లో 6.78 ఇంచుల 1.5K అద్భుతమైన AMOLED (LTPS) డిస్ప్లేను అందించారు. గేమింగ్ స్మూత్‌నెట్ కోసం ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంది. మెరుగైన ఆడియో అనుభూతి కోసం ప్రత్యేక స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఒప్పో ఈసారి స్నాప్‌డ్రాగన్‌ను పక్కన పెట్టి అత్యంత శక్తివంతమైన MediaTek Dimensity 9500S ప్రాసెసర్‌ను వాడింది. బేస్ వేరియంట్ 12GB RAM, 256GB (UFS 4.1) స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఇండియాకు వస్తే BGMI వంటి గేమ్స్‌ను 120 fps లో ఆడేలా అద్భుతమైన ఆప్టిమైజేషన్ చేసే అవకాశం ఉంది.

Advertisement

Read also-గంటకు రూ.4 ఖర్చుతో కూలింగ్.. మార్కెట్లోకి సరికొత్త ఏసీ.. ధర రూ.14,499 మాత్రమే!

భారీ బ్యాటరీ

ఈ ఫోన్‌లో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల దాదాపు గంట వ్యవధిలోనే ఫోన్ ఫుల్ చార్జ్ అయిపోతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే, వెనుక వైపు 50MP (Sony IMX 890 సెన్సార్) ప్రధాన కెమెరాతో పాటు, కొత్తగా 8MP వైడ్ యాంగిల్ కెమెరాను జతచేశారు. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. భద్రత కోసం వేగవంతమైన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, దుమ్మ, నీటి నుండి రక్షణ కోసం IP68/69 రేటింగ్, IR బ్లాస్టర్, మరియు Wi-Fi 7 వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో K15 సిరీస్ ఇండియా మార్కెట్లోకి ఈ ఏడాది ఆగస్టు (2026) లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారీ అప్‌గ్రేడ్స్ ఉన్నందున ఇండియాలో దీని ధర సుమారు రూ.60,000 వరకు ఉండవచ్చని అంచనా. బడ్జెట్ పరిమితి లేకుండా అల్టిమేట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్, భారీ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×