E-Paper
Advertisement

గెలుస్తామ‌ని ధీమాతో ఉన్నోళ్లు.. ఇంత దిగ‌జారుడు రాజ‌కీయ‌లను ఎందుకు ఎంచుకున్న‌ట్టు..!?

గెలుస్తామ‌ని ధీమాతో ఉన్నోళ్లు.. ఇంత దిగ‌జారుడు రాజ‌కీయ‌లను ఎందుకు ఎంచుకున్న‌ట్టు..!?
Advertisement

ఇది కేసీఆర్ ప్లానా? కేటీఆర్ ప‌న్నాగ‌మా? ఓట‌మి నుంచి నేర్చుకున్న కొత్త పాఠాలా? ఈ త‌రం రాజ‌కీయాలు ఇలాగే ఉండాల‌ని ఫిక్స్ అయిపోయారా? ఓ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. అదీ ప‌దేళ్లు పాలించిన పార్టీ.. అంత‌కు ముందు ఉద్య‌మ‌పార్టీగా చ‌రిత్ర‌కెక్కిన పార్టీ…! ఎందుకు అధికారం కోసం ఇంత‌లా దిగ‌జారుతోంది. ఇదంతా డెబ్బైవేల పుస్త‌కాలు చ‌దివిన మేథ నుంచి పుట్టిన బుద్దేనా? నేను కేసీఆర్ అంత మంచోడ్నీ కాదురోయ్‌… ఒక్కొక్క‌డి సంగ‌తి చెబుతా…! ఉరికుచ్చి ఉరికిచ్చి కొడ‌తా! ఏ పొక్క‌లో దాచుకున్నా వ‌ద‌లా! అని శ‌ప‌థాలు ప‌న్ని.. తొడ‌లు చ‌రుచుకుంటున్న యువ‌నేత మ‌స్తిష్క కిష్కింధ‌కాండా!? ఏదేమైనా.. కేటీఆర్ త‌న సొంత ఎజెండాను ఆ పార్టీలో అమ‌లు చేస్తున్నాడు.

కేసీఆర్ అన్య‌మ‌న‌స్కంగా ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్నాడు. ఇది నీ పార్టీ.. రాబోయే నీ రాజ్యం.. నీవెంట ఉండే దండును నీవే ఎంచుకో.. అని కేసీఆర్ అన్న‌ట్టుగా.. కేటీఆర్ దాన్ని ఫాలో చేస్తున్న‌ట్టుగా త‌న టీమ్‌తో ఓ అరాచ‌క‌, దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు ఆజ్యం పోశాడు. మాంత్రికుడి ప్రాణం చిలుక‌లో ఉన్న‌ట్టు.. ఇప్పుడు కేటీఆర్ ప్రాణం అత‌ను సృష్టించుకున్న సోష‌ల్ మీడియాలో ఉంది. అత‌నెంచుకున్న వందిమాగ‌ధులైన.. అరాచ‌క‌శ‌క్తుల వ‌ద్ద ఉంది. ఓ క్రిషాంక్‌, ఓ ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌, పాడె కౌషిక్‌.. తాజాగా బాల్క సుమ‌న్‌.. వీరే ఇప్పుడు కేటీఆర్‌కు ఆయువు ప‌ట్టు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంత రెచ్చిపోతే.. ఎంత రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌ను రాజేస్తే అంత‌గా బూస్టింగ్ ఈ పార్టీకి. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ.. సోష‌ల్ మీడియాను న‌మ్ముకుని ఎట్లా ఎదిగిందో… ఇప్పుడిది బీఆరెస్ పార్టీ కాదు.. బొద్దింక ర‌క్ష‌ణ పార్టీ అన్న‌ట్టు. సాయంకాలం నీరెండ‌లా ఇది ఒక్క‌సారిగా ఎదిగిపోయి ఆకాశాన్నంటిన‌ట్టే క‌నిపిస్తుంది.

Advertisement

ఆ త‌రువాత తెర‌మ‌ర‌గ‌వుతుంది. ప్ర‌జా ఉద్య‌మాల‌తో నిర్మిత‌మై, వారితో మ‌మేక‌మైన పార్టీ ఉద‌యం నీరెండ‌లా కొద్ది కొద్దిగా మ‌రుగుజ్జుగా ప్రారంభ‌మై.. అనంతంగా ఎదుగుతుంది. ఇప్పుడు బీఆరెస్ పార్టీ ఎంచుకున్న‌ది.. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోవాలి.. అది ఏ రూటైనా స‌రే.. ఏ విధాన‌మైనా స‌రే! ప్ర‌జామోదం ఉన్నా స‌రే.. లేకున్నా స‌రే! కేసీఆర్ రావాలె .. మ‌ళ్లీ బీఆరెస్ స‌ర్కార్ వ‌స్తుంది…! అని కేసీఆర్ ఓవైపు ఫామ్‌హౌజ్‌లో త‌న సీనియ‌ర్ల‌తో మీటింగులు పెట్టుకుంటాడు. కానీ ఇక్క‌డ కొడుకు చేతిలో ఉన్న స్టీరింగ్ అదుపు త‌ప్పి.. చిల్ల‌ర‌, దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది. హింస‌ను న‌మ్ముకుంటున్నారు. విధ్వంసాల సృష్టితో కొత్త చ‌రిత్ర సృష్టించాల‌నుకుంటున్నారు.

దీనికి ఉద్య‌మ‌మ‌నే పేరు పెట్టుకోనున్నారు. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ కాన‌ప్పుడు.. ఇక త‌మ ఉనికే ప్ర‌మాద‌మ‌ని వారికే వారే ఇన్ఫిరియారిటీకి లోనయిన‌ప్ప‌డు ఎంచుకునే ప‌ద్ద‌తి ఇది. కేసీఆర్ ప‌ట్ల ఇంకా జ‌నాల‌కు అంతో ఇంతో న‌మ్మ‌క‌ముంది. ఆయ‌న ఫామ్‌హౌజ్‌లో ఉన్నా… ఆ పార్టీని త‌న ఆలోచ‌న‌ల‌తో ముందుకు న‌డిపిస్తున్నాడ‌నే న‌మ్ముతున్నారు. కానీ ఇలా ప‌క్క‌దారి ప‌ట్టి… హ‌ద్దులు మీరి.. అరాచ‌కాలే.. ప్ర‌స్తుత రాజ‌కీయ విధానాల‌ని కొత్త నిర్వ‌చ‌నం వెతికే ప‌నిలో ఉంటే.. అది కేసీఆర్‌కే మ‌చ్చ‌. ఆయ‌న త‌న పార్టీ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయ‌ని న‌మ్ముతున్నాడ‌ని జ‌నం న‌మ్మాల్సి వ‌స్తుంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన‌ట్టు.. కొడుకుకు స్టీరింగ్ అప్ప‌గిస్తే అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డి తుక్కుకింద మార్చి షెడ్‌కు పంప‌క‌ముందే… తేరుకుంటే మంచిందంటున్నారు గులాబీ ద‌ళం శ్రేయోభిలాషులు.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×