E-Paper
Advertisement

Oppo Find X9 Ultra: ఒప్పో నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్ లీక్!

Oppo Find X9 Ultra: ఒప్పో నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్ లీక్!
Advertisement

Oppo Find X9 Ultra: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో సరికొత్త సంచలనాలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు చైనా మార్కెట్‌కే పరిమితమైన తన Ultra మోడల్‌ను ఈసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో Oppo Find X9 Ultra గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. దీనితో పాటు చైనాలో Find X9s Pro మోడల్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయబోతోందని తాజా తీక్స్ ద్వారా తెలుస్తోంది.

గ్లోబల్ మార్కెట్‌పై ఒప్పో గురి..

ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ లౌ సోషల్ మీడియా వేదికగా ఈ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలో Find X9 Ultraను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు ఆయన ధృవీకరించారు. గ్లోబల్ యూజర్ల పట్ల తమకున్న నిబద్ధతను చాటుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే.. మెటల్ ఫ్రేమ్‌తో చాలా ప్రీమియంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 16 సిరీస్‌లోని కెమెరా కంట్రోల్ బటన్‌ను పోలి ఉండేలా, దీనిలో ఒక ప్రత్యేకమైన ఆరెంజ్ బటన్‌ను అందించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X8 ప్రో సిరీస్ సేల్ షురూ.. ఈ క్రేజీ ఫీచర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి!

కెమెరా సెటప్‌లో కొత్త ప్రయోగం..

ఇకపోతే ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఒప్పో మరోసారి Hasselblad సంస్థతో జతకట్టింది. త్వరలో రాబోతున్న Find X9 Ultraలో అత్యుత్తమ కెమెరా సెటప్‌ను మనం చూడబోతున్నాం. తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. ఇది దూరంగా ఉన్న వస్తువులను కూడా అత్యంత స్పష్టతతో షూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు.. 10x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉన్న మరో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా దీనిలో ఉండే అవకాశం ఉంది.

Oppo Find X9s Pro విషయానికి వస్తే..

Advertisement

ఈ ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో రానుందని టెక్ నిపుణుల అంచనా. దీనిలో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అందించబోతున్నారట. అయితే అల్ట్రా మోడల్‌లో అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుందని కంపెనీ హింట్ ఇచ్చింది. భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరాలు, కొత్త తరం ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే కొన్ని వారాల్లో ఈ ఫోన్ల ధర, పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Also Read: బడ్జెట్ యూజర్లకు జాక్‌పాట్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లుచెదిరే డిస్కౌంట్!

 

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×