// // Free OTT Subscriptions: ఒక్క రీఛార్జ్‌తో.. Netflix, Hotstar, Prime ఫ్రీ! -->
E-Paper
Advertisement

Free OTT Subscriptions: ఒక్క రీఛార్జ్‌తో.. Netflix, Hotstar, Prime ఫ్రీ.. ఓటీటీ ప్రియులూ ఇక రెచ్చిపోండి!

Free OTT Subscriptions: ఒక్క రీఛార్జ్‌తో.. Netflix, Hotstar, Prime ఫ్రీ.. ఓటీటీ ప్రియులూ ఇక రెచ్చిపోండి!
Advertisement

Free OTT Subscriptions: ప్రస్తుత రోజుల్లో ఓటీటీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు, సిరీస్ లు, ఎంటర్ టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్.. ఇలా ప్రతీ దానికోసం యూత్ ఓటీటీల మీద ఆధారపడుతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి ప్రధాన ఓటీటీ వేదికలు.. సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్ (Airtel), జియో (Jio), వోడాఫోన్ ఐడియా (Vi) తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఉచితంగానే వాటి సబ్ స్క్రిప్షన్స్ అందిస్తున్నాయి. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రిలయన్స్ జియో ప్లాన్‌లు

జియో తన ప్రీపెయిడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌, హాట్ స్టార్ ను ఆఫర్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ ప్లాన్ కోరుకునే వారు రూ.1,299, రూ.1,799 ప్లాన్స్ ను ట్రై చేయవచ్చు. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఒకవేళ ప్రైమ్ కావాలనుకుంటే రూ.1,029 ప్లాన్‌తో 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ పొందవచ్చు. మరోవైపు జియో తన మెజారిటీ ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్స్ లో హాట్ స్టార్ ను ఉచితంగా అందిస్తుండటం విశేషం.

ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

Advertisement

ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ప్రీమియం ఓటీటీ సేవల ప్యాక్‌లను అందిస్తోంది. రూ.1,798 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీతో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ కోరుకుంటే రూ.1,399, రూ.1,749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకోవచ్చు. తద్వారా మూడింటినీ ఒకే ప్లాన్‌లో అందిస్తోంది. వీటితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే (Airtel Xstream Play) ద్వారా 20కి పైగా ఓటీటీ ఛానెల్‌లను కూడా చూడవచ్చు.

Also Read: UP Crime: ఇద్దరు భార్యలు.. 18 మంది పిల్లలు.. కట్ చేస్తే దారుణ హత్య!

వోడాఫోన్ ఐడియా ప్లాన్‌లు

Advertisement

వోడాఫోన్ ఐడియా కూడా తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఆఫర్లను గట్టిగానే అందిస్తోంది. రూ.1,198 (70 రోజులు), రూ.1,599 (84 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. రూ.3,799 వార్షిక ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్, రూ.3,699 ప్లాన్ తో హాట్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. Vi మాక్స్ (Vi Max) పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ద్వారా మీకు నచ్చిన ఓటీటీ ప్లాన్‌ను ఎంచుకునే వెసులుబాటును వోడాఫోన్ ఇండియా కల్పిస్తోంది.

ముఖ్యగమనిక: పైన పేర్కొన్న ప్లాన్ ధరలు, ఓటీటీ ప్రయోజనాలను నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు మార్పు చేసే అవకాశం ఉంది. రీఛార్జ్ చేసే ముందు మీ నెట్‌వర్క్ యాప్‌ (MyJio, Airtel Thanks, Vi App)  లేదా వెబ్ సైట్ లోకి వెళ్లి ప్లాన్ వివరాలను చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: LPG Gas: గంటపాటు వంట చేస్తే.. ఖర్చయ్యే LPG ఎంత? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెస్ట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×