E-Paper
Advertisement

10x జూమ్, 200MP కెమెరాతో రానున్న Oppo Find X9 Ultra.. ఐఫోన్ కూడా దీని ముందు దిగదుడుపే!

10x జూమ్, 200MP కెమెరాతో రానున్న Oppo Find X9 Ultra.. ఐఫోన్ కూడా దీని ముందు దిగదుడుపే!
Advertisement

Oppo Find X9 Ultra: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలో ‘Find X9’ సిరీస్‌ ఏప్రిల్ 21న చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్‌లోనూ ఈ ఫోన్లు గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా Find X9 Ultra, Find X9s Pro మోడల్స్ గురించి ఇప్పుడు టెక్ లవర్స్‌లో ఆసక్తి పెరిగింది. ప్రముఖ లీక్స్‌టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లు లుక్ పరంగానే కాదు.. పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఎంతో మెరుగ్గా ఉండబోతున్నాయట.

ప్రీమియం లుక్ డిజైన్..

Oppo Find X9s Pro గురించి చెప్పాలంటే.. దీనిలో 6.32 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్ ఇస్తున్నారు. ఇది చూడటానికి చాలా ప్రీమియంగా, స్లిమ్ బెజెల్స్‌తో కనిపిస్తుంది. ఇక 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ ఆడినా, వీడియోలు చూసినా మెరుగైన పనితీరు అందిస్తుంది. మరోవైపు ఆల్ట్రా మోడల్‌లో 6.82 అంగుళాల భారీ 2K+ డిస్‌ప్లేను అమర్చారు. ఈ రెండు ఫోన్లలో వాడిన ఎల్‌టీపీఓ టెక్నాలజీ వల్ల బ్యాటరీ చాలా సేపు వస్తుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే.. వైట్, టైటానియం, గ్లేసియర్ లాంటి క్లాసీ రంగుల్లో ఇవి దొరకనున్నాయి.

200 మెగాపిక్సెల్ కెమరా..

Advertisement

ఫొటోల కోసం Pro మోడల్‌లో ఏకంగా డ్యూయల్ 200MP కెమెరా సెటప్‌ను ఒప్పో అందిస్తోంది. దీనిలో ఉండే టెలిఫోటో లెన్స్ ద్వారా 2.8x వరకు జూమ్ చేసినా ఫొటోలు క్లారిటీ తగ్గవు. ఇక Ultra మోడల్ అయితే 50MP పెరిస్కోప్ కెమెరాతో ఏకంగా 10x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీంతో ఎంత దూరంలో ఉన్న వాటినైనా ఇట్టే ఫొటో తీసేయొచ్చు. అలాగే క్వాలిటీ విషయంలో ఒప్పో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.

Also Read: టీవీ అంటే ఇలా ఉండాలి.. 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అదరగొడుతున్న TCL మినీ LED టీవీలు!

7,000mAh బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

సాధారణంగా మనం వాడే ఫోన్లలో 5,000 mAh బ్యాటరీ ఉంటేనే పెద్దది అనుకుంటాం. కానీ ఒప్పో ఏకంగా 7,000mAh కెపాసిటీ దాటిన బ్యాటరీలతో షాక్ ఇచ్చింది. Pro మోడల్‌లో 7,025 mAh, Ultra మోడల్‌లో 7,050 mAh బ్యాటరీలను ఇచ్చారు. దీనికి తోడు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. దీంతో గంటల తరబడి ఛార్జింగ్ పెట్టే పని లేకుండా.. నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ అయిపోతుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ బరువు 198 గ్రాములు మాత్రమే ఉండటం విశేసం.

లాంచ్ ఎప్పుడంటే?

సౌండ్ క్వాలిటీ కోసం Ultra మోడల్‌లో డ్యూయల్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఫోన్ వాడుతున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ కూడా చాలా నాచురల్‌గా ఉండేలా బయోనిక్ మోటార్ వాడారు. అలాగే నేటి కుర్రాళ్లకు నచ్చేలా వైబ్రెంట్ ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో కూడా ఇవి లభించనున్నాయి. ఈనెల 21న లాంచ్ అయిన వెంటనే వీటి ధర ఎంత ఉంటుంది, మన దగ్గర ఎప్పటి నుంచి దొరుకుతాయి అనే విషయాలపై క్లారిటీ రానుంది.

Also Read: ఎన్నాళ్లు వెయిట్ చేసినా ఇలాంటి ఆఫర్ రాదు.. పిక్సెల్, గెలాక్సీ, మోటో.. ఏ ఫోన్ కొన్నా 50% డిస్కౌంట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×