E-Paper
Advertisement

Medchal: పోలీసులకే షాక్ ఇచ్చిన నిందితులు.. క్యాబేజీ బస్తాల కింద ఇంత పెద్ద మోసమా?

Medchal: పోలీసులకే షాక్ ఇచ్చిన నిందితులు.. క్యాబేజీ బస్తాల కింద ఇంత పెద్ద మోసమా?
Advertisement

Medchal: స్వేచ్ఛ బ్యూరో: నిషేధిత బీజీ-III పత్తి విత్తనాల అక్రమ రవాణాను మేడ్చల్ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు శుక్రవారం మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్-6 సమీపంలో పోలీసులు, ఎస్ఓటీ కుత్బుల్లాపూర్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి మహీంద్రా బొలెరో వాహనం (AP39VE4038)ను అడ్డగించారు.

వాహనంలో సుమారు 3000 కిలోల నిషేధిత బీజీ-III పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించి చెవుల నర్సింహులు, తలారి రమేష్ లను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ రూ.30 లక్షలు, వాహనం విలువ రూ.8 లక్షలు కలిపి మొత్తం రూ.38 లక్షలుగా పోలీసులు తెలిపారు. పోలీసుల తనిఖీలకు తప్పించుకోవడానికి నిందితులు విత్తనాల బస్తాలను క్యాబేజీ బస్తాల కింద దాచినట్లు వెల్లడైంది.

Advertisement

కర్నూలు జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు ఈ సరుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన సరఫరాదారు మగులూరి సాంబశివరావు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌ను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి ఐపీఎస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ శంకర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, మేడ్చల్ డీఐ కిరణ్ బృందం విజయవంతంగా నిర్వహించింది. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×