E-Paper
Advertisement

Smartphone Comparison: ఒప్పో ఫైండ్ X9 ప్రో vs హానర్ మ్యాజిక్ 8 ప్రో.. రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్స్.. ఏది కొనాలి?

Smartphone Comparison: ఒప్పో ఫైండ్ X9 ప్రో vs హానర్ మ్యాజిక్ 8 ప్రో.. రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్స్.. ఏది కొనాలి?
Advertisement

Oppo Find X9 Pro vs Honor Magic 8 Pro Comparison| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా ఫొటోగ్రఫీ స్పెషల్ ఫోన్ ఒప్పో ఫైండ్ X9 ప్రోని భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్‌కు పోటీగా మరో కొత్త ఫోన్ ఇటీవలే విడుదలైంది. అదే హానర్ మ్యాజిక్ 8 ప్రో. ఈ రెండూ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు. ఈ ఫోన్లు కెమెరా క్వాలిటీపై ఎక్కువ దృష్టి పెట్టాయి. రెండింటిలో ఏది మీకు బెస్ట్ అని తెలుసుకోవడానికి, ముఖ్యమైన ఫీచర్లను పోల్చి చూద్దాం.

డిస్‌ప్లే, డిజైన్

హానర్ మ్యాజిక్ 8 ప్రోలో 6.71 ఇంచ్ పెద్ద, బ్రైట్ LTPO OLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో గేమింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫోన్ డిజైన్ బోల్డ్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో కూడా LTPO OLED స్క్రీన్‌తో వస్తుంది. అయితే ఇది కాస్త పెద్ద స్క్రీన్. 6.78 ఇంచ్ డిస్‌ప్లే ఉండగా.. ఇందులో 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కలర్స్ చాలా వివిడ్‌గా, డీటెయిల్స్ షార్ప్‌గా ఉంటాయి. ఒప్పో డిజైన్ మరింత ఎలిగెంట్, రిఫైన్డ్‌గా ఉంటుంది. రెండు ఫోన్ల బిల్డ్ క్వాలిటీ సూపర్.

కెమెరా సిస్టమ్

Advertisement

హానర్ మ్యాజిక్ 8 ప్రో కెమెరా చాలా అద్భుతం. మెయిన్ సెన్సార్‌లో వేరియబుల్ అపర్చర్ ఉంటుంది. పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ దూరంలోని ఫోటోలు సూపర్ డీటెయిల్డ్‌గా తీస్తుంది. జూమ్ చేసినా క్వాలిటీ బాగుంటుంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రోలో హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్ ఉంది. కలర్స్ చాలా నేచురల్‌గా, ప్రొఫెషనల్ లుక్‌తో వస్తాయి. డ్యూయల్ పెరిస్కోప్ సిస్టమ్ ఉండటంతో మీడియం, లాంగ్ రేంజ్ జూమ్ అదిరిపోతుంది. ఫోటోగ్రఫీ ప్రియులకు రెండింటిలో ఒప్పో బెటర్ ఆప్షన్.

పెర్ఫామెన్స్

రెండు ఫోన్లలోనూ లేటెస్ట్ ప్రాసెసర్లు ఉన్నాయి. హానర్‌లో Snapdragon 8 Elite ఉండగా.. ఒప్పోలో MediaTek Dimensity 9500. చిప్ ప్రాసెసర్ ఉంటుంది. రెండూ చాలా ఫాస్ట్. గేమ్స్, మల్టీటాస్కింగ్ సూపర్ స్మూత్. ఏ యాప్ అయినా ఎలాంటి ల్యాగ్ లేకుండా రన్ అవుతుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

Advertisement

హానర్ మ్యాజిక్ 8 ప్రోలో పెద్ద బ్యాటరీ (సుమారు 7000mAh+) ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే పూర్తి రోజు సులభంగా జరుగుతుంది. ఫోన్ ఛార్జ్ చేయడానికి వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండూ చాలా ఫాస్ట్.
ఒప్పో ఫైండ్ X9 ప్రోలో 7500mAh బ్యాటరీ ఉంది. ఇది కూడా అద్భుతమైన బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ చాలా త్వరగా ఉంటుంది, కొద్ది నిమిషాల్లోనే పవర్ బూస్ట్ వస్తుంది. 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్, AI

హానర్‌లో Magic OS (Android బేస్) ఉంటుంది. ఫోన్‌లోని AI ఫీచర్లు మీ ఫోన్ ఉపయోగించే తీరుని బట్టి స్మార్ట్‌గా వర్క్ చేస్తాయి.
ఒప్పోలో ColorOS – క్లీన్, స్మూత్. ఫోటోలు, సిస్టమ్ ఆప్టిమైజేషన్‌లో AI బాగా హెల్ప్ చేస్తుంది. రెండూ యూజర్ ఫ్రెండ్లీ.

ధర (భారతదేశంలో అంచనా)

హానర్ మ్యాజిక్ 8 ప్రో: 12GB + 256GB – సుమారు రూ.71,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియాలో ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు.
ఒప్పో ఫైండ్ X9 ప్రో: 16GB + 512GB – సుమారు రూ.1,05,000 నుంచి రూ.1,10,000.
హానర్ కొంచెం చీప్, కానీ ఒప్పోలో ఎక్కువ స్టోరేజ్ వస్తుంది.

ఏది బెస్ట్?

మీకు దూరం నుంచి జూమ్ ఫోటోలు, పెద్ద బ్యాటరీ కావాలంటే హానర్ మ్యాజిక్ 8 ప్రో తీసుకోండి. నేచురల్ కలర్స్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎలిగెంట్ డిజైన్ కావాలంటే ఒప్పో ఫైండ్ X9 ప్రో బెటర్. రెండూ అద్భుతమైన ఫ్లాగ్‌షిప్‌లు.

Also Read: సోషల్ మీడియాలో ఏఐ వీడియోలతో మోసం.. నకిలీ వీడియోలను ఇలా గుర్తించండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×