E-Paper
Advertisement

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!
Advertisement

Oppo A7 Pro Max: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలోనే తమ A సిరీస్‌లో ఒక సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి భారీ బ్యాటరీ కలిగిన ఫోన్లు మార్కెట్‌లోకి చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ పేరు Oppo A7 Pro Max అని తెలుస్తోంది.

కంటికి ఇంపుగా ఉండే డిస్‌ప్లే:

ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను అందించబోతున్నారు. ఇది 1.5K రెజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు చూసేటప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. సెక్యూరిటీ కోసం దీనిలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించనున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Advertisement

Also Read: ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

ఆకట్టుకునే స్లిమ్‌ డిజైన్:

Oppo A7 Pro Max ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. ఏకంగా 10,000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని ఇందులో అందించబోతున్నారు. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా, లావుగా ఉంటుంది. కానీ ఓప్పో దీనిని చాలా స్లిమ్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నల్ ప్రాసెసింగ్ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు.

కెమెరా ఫీచర్ల సంగతేంటి?

Advertisement

ఇకపోతే ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించబోతుండటం గమనార్హం. ప్రస్తుతం ఓప్పో ఈ ఫోన్ గురించిన వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×