// //
OnePlus 16: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలో మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 16 రాబోతోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట్లో సెప్టెంబర్‌లోనే వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. లాంచ్ డేట్‌ను అక్టోబర్‌కు మార్చినట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయంలో వన్‌ప్లస్ ఏ మాత్రం తగ్గడం లేదు. దీనిలో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని అందించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా.. క్వాల్‌కామ్ త్వరలో పరిచయం చేయనున్న పవర్‌ఫుల్ ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రొ’ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని సమాచారం. దీనివల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటాయి.
Also Read: ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?
OnePlus 16 లుక్ పరంగా పాత OnePlus 15 మోడల్ తరహాలోనే స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను కొనసాగించనున్నారు. దీనిలో 6.78 ఇంచుల ఫ్లాట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇక ఫొటోగ్రఫీ కోసం 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను టెస్ట్ చేస్తున్నారట. దీనికి తోడు ఫోన్‌లో ప్రత్యేకంగా ఒక AI బటన్ కూడా ఉండబోతోంది.
చైనాలో అక్టోబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానున్న ఈ మోడల్ కోసం మన దేశంలోనూ చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే భారతీయ వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు ఒక చిన్న నిరాశ కలిగించే వార్త ఏంటంటే.. ఈ ఫోన్ ఇండియా మార్కెట్‌కు రాకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: Made by Google ఈవెంట్‌కు ముందే బ్యాడ్ న్యూస్.. Pixel 10 కొన్నవాళ్లకీ తప్పని తిప్పలు!