E-Paper
Advertisement

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!
Advertisement

Microwave Safety: వంటగదిలో వాడే అత్యంత ఉపయోగకరమైన ఎలక్ట్రానిక్ పరికరాల్లో మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి. క్షణాల్లో ఆహారాన్ని వేడి చేయడానికి, వంటలను ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే తొందరపాటులోనో, సరైన అవగాహన లేకపోవడం వల్లనో కొందరు పొరపాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఆహారం రుచిని కోల్పోవడమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తోంది. కాబట్టి మైక్రోవేవ్ వాడేటప్పుడు మనం చేసే ఐదు ముఖ్యమైన పొరపాట్లు, వాటి వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

సరైన పాత్ర ఎంపిక

చాలామంది మైక్రోవేవ్‌లో ఏ పాత్ర పడితే అది పెట్టేస్తుంటారు. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు లేదా మెటల్ పాత్రలను వాడటం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఆహారంలోకి చేరే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెటల్ పాత్రల వల్ల స్పార్క్స్ వచ్చి మైక్రోవేవ్ పాడయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మైక్రోవేవ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వస్తువులను మాత్రమే వాడాలని హితవు పలుకుతున్నారు.

ఆహారంపై మూత పెట్టకపోవడం

Advertisement

ఆహారపదార్థాలను మూతపెట్టకుండా ఓవెన్ లో వేడి చేస్తే.. దానిలోని నూనె, నీరు ఆవిరై లోపలి చిమ్మీ జిడ్డుగా మారే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలోని తేమ మెుత్తం ఆవిరై.. ఎండిపోయిన భావన కలిగిస్తుంది. కాబట్టి పదార్థాలను వేడి చేసేటప్పుడు మూత పెట్టడం లేదా పేపర్ కవర్ ఉపయోగించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆహారాన్ని కలపకపోవడం

మైక్రోవేవ్‌లో ఆహారం అంతా ఒకేలా వేడెక్కదు. ఓవేన్ హీట్ కొన్ని భాగాలకే ఎక్కువగా తగిలి.. కొన్ని ప్రదేశాల్లో ఆహారం చల్లగానే ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు మధ్యలో ఒకసారి ఆహారాన్ని బయటకు తీసి పదార్థాలను కలపడం లేదా తిప్పడం చేయాలి. దీనివల్ల ఆహారం అంతటా సమానంగా వేడెక్కుతుంది.

ఓవర్ హీటింగ్

Advertisement

కొంత మంది ఓవెన్ లో ఆహారాన్ని మరీ ఎక్కువగా వేడి చేసేస్తుంటారు. దీని వల్ల రుచి, పోషకాలు పోయే ప్రమాదముంది. ఓవర్ హీటింగ్ వల్ల చపాతీలు, పిండి పదార్థాలు గట్టిగా మారితే.. పాలు లేదా సూప్‌లు పొంగి ఓవెన్ లోపలి భాగంలో పడిపోతాయి. కాబట్టి సరైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఆహారాన్ని వేడి చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

క్లీనింగ్ చేయకపోవడం..

మైక్రోవేవ్ లోపల పడ్డ ఆహార వ్యర్థాలు, జిడ్డును క్రమం తప్పకుండా క్లీన్ చేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే అక్కడ బ్యాక్టీరియా చేరే అవకాశం హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఓవెన్ ను వాడిన ప్రతీసారి లేదంటే వారానికి ఒకసారైనా నిమ్మరసం, నీళ్ల ఆవిరి సహాయంతో మైక్రోవేవ్‌ను శుభ్రంగా తుడుచుకోవాలని హితవు పలుకుతున్నారు.

Also Read: జియో యూజర్లకు పండగే.. ఒక్క రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. టీవీలో కూడా చూడొచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×