E-Paper
Advertisement

Smartphone Comparison: వన్‌ప్లస్ 15 vs శామ్‌సంగ్ గెలాక్సీ S25 vs పిక్సెల్ 10.. ఏ ఫ్లాగ్‌షిప్ బెస్ట్?

Smartphone Comparison: వన్‌ప్లస్ 15 vs శామ్‌సంగ్ గెలాక్సీ S25 vs పిక్సెల్ 10.. ఏ ఫ్లాగ్‌షిప్ బెస్ట్?
Advertisement

OnePlus 15 vs Google Pixel 10 vs Samsung S25 Comparison | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తాజాగా మూడు అద్భుత ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు పోటీ పడుతున్నాయి. వన్‌ప్లస్ 15 విడుదల కావడంతో గూగుల్ పిక్సెల్ 10, శామ్‌సంగ్ గెలాక్సీ S25‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ మూడు ఫోన్లు కూడా ప్రీమియం ఫీచర్లు కలిగి ఉన్నాయి. మీ అవసరాలకు తగిన ఫోన్ ఎంచుకోవడానికి ఈ పోలిక సహాయపడుతుంది. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్, ఫీచర్లు వివరంగా చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

వన్‌ప్లస్ 15 12GB RAM/256GB వేరియంట్ ధర రూ.72,999; 16GB/512GB వేరియంట్ ధర రూ.79,999.
గూగుల్ పిక్సెల్ 10 12GB/256GB వేరియంట్ ధర రూ.79,999.
శామ్‌సంగ్ గెలాక్సీ S25 12GB/256GB ధర రూ.63,580; 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.92,999.
ధర విషయంలో S25 సేమ్ స్టోరేజ్ వేరియంట్ అన్నిటి కన్నా తక్కువకు ఇస్తోంది. కానీ హై-ఎండ్ మోడల్ వేరియంట్ ఎక్కువ ఖరీదు.

డిస్‌ప్లే, స్క్రీన్ టెక్నాలజీ

Advertisement

వన్‌ప్లస్ 15లో 6.78-ఇంచ్ LTPO AMOLED స్క్రీన్, 1-165Hz రిఫ్రెష్ రేట్ తో గేమింగ్‌కు అద్భుతమైన ఫోన్. గేమర్స్ కోసమే వన్ ప్లస్ కంపెనీ ఈ కొత్త ఫోన్ ని విడుదల చేసింది.
పిక్సెల్ 10: 6.3-ఇంచ్ యాక్టువా OLED, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ – కాంపాక్ట్, క్లియర్ వ్యూస్ ఇస్తుంది.
S25: 6.2-ఇంచ్ డైనమిక్ AMOLED 2X, 120Hz రిఫ్రెష్ రేట్ తో – స్థిరమైన, వైబ్రెంట్ కలర్ పిక్చర్స్ చూడగలము.
డిస్‌ప్లే విషయంలో వన్‌ప్లస్ పెద్ద స్క్రీన్‌తో ముందంజలో ఉంది.

ప్రాసెసింగ్ పవర్, పెర్ఫామెన్స్

వన్‌ప్లస్ 15లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ చిప్ తో వస్తుంది. గేమింగ్‌లో అత్యుత్తమం, మల్టీటాస్కింగ్ సూపర్ ఫాస్ట్.
పిక్సెల్ 10: కస్టమ్ టెన్సర్ G5 – AI చిప్ ఉంటుంది. మెషిన్ లెర్నింగ్‌లో స్పెషలిస్ట్, స్మూత్ పెర్ఫామెన్స్ ఇస్తుంది.
S25: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్.. వేగవంతమైన, నమ్మకమైన పనితీరు ఇస్తుంది.
అన్నీ టాప్-టైర్ ఫోన్లు, కానీ వన్‌ప్లస్ గేమర్లకు బెస్ట్.

కెమెరా సామర్థ్యాలు

Advertisement

వన్‌ప్లస్ 15: 50MP పెరిస్కోప్ (జూమ్) కెమెరా ఉంది. ఇందులో 50MP+50MP+50MP ట్రిపుల్ కెమెరా సెటప్ – వైడ్, నార్మల్ యాంగిల్స్‌లో కూడా అద్భుత ఫోటోలు ఇస్తుంది.
పిక్సెల్ 10: 48MP మెయిన్, అడ్వాన్స్‌డ్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ చేయగలము. ప్రతి సిట్యువేషన్‌లో స్టన్నింగ్ ఇమేజెస్ తీయగలము.
S25: 50MP మెయిన్ + టూ సపోర్టివ్ లెన్సెస్ – వైడ్-యాంగిల్, మోడరేట్ క్వాలిటీ ఫోటోలకు బాగుటుంది.
పిక్సెల్ AI మ్యాజిక్‌తో కెమెరా ఉండడంతో పిక్సెల్ 10 ముందంజలో ఉంది.

సాఫ్ట్‌వేర్, యూజర్ ఎక్స్‌పీరియన్స్

వన్‌ప్లస్ 15 లో ఆండ్రాయిడ్ 15 + కలర్‌OS 16 – ఫీచర్-రిచ్, కస్టమైజబుల్ ఇంటర్‌ఫేస్ ఉంది.
పిక్సెల్ 10: ప్యూర్ ఆండ్రాయిడ్ 16 – టైమ్లీ అప్‌డేట్స్, క్లీన్, ఇన్‌ట్యూటివ్ UX ఉంది.
S25: ఆండ్రాయిడ్ 15 + వన్ UI 7 – ప్రొడక్టివిటీ ఫీచర్లు అనేకం.
సాఫ్ట్‌వేర్ ప్యూరిటీలో పిక్సెల్ టాప్.

కనెక్టివిటీ, డైమెన్షన్లు

మూడు ఫోన్లు కూడా 5G, Wi-Fi, బ్లూటూత్, NFC సపోర్ట్ చేస్తాయి.

ఇక సైజు విషయంలో వన్‌ప్లస్ 15: అతిపెద్ద, హెవీ డివైజ్. పిక్సెల్ 10 – బ్యాలెన్స్‌డ్ సైజ్, వెయిట్ తో వస్తుంది. శామ్‌సంగ్ S25: అతి కాంపాక్ట్ ఫోన్, లైట్‌వెయిట్ గా ఉంటుంది. హ్యాండ్‌లింగ్ కూడా సులువుగా ఉంటుంది.

ఏ ఫోన్ బెస్ట్?

పెర్ఫామెన్స్, వర్సటైల్ కెమెరాలు కావాలంటే వన్‌ప్లస్ 15. సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు కోసం పిక్సెల్ 10. కాంపాక్ట్ డిజైన్, రిలయబుల్ పెర్ఫామెన్స్ అంటే S25. మీ అవసరాలు, బడ్జెట్‌ ఆధారంగా ఎంచుకోండి. 2025లో ఈ మూడు ఫోన్‌లు మార్కెట్‌ను షేక్ చేస్తాయి!

Also Read: సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్, ఫ్రీ ఓటీటీ టివి.. కేవలం రూ.449కే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×