E-Paper
Advertisement

OnePlus PriceCut: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 32MP AI సెల్ఫీ కెమెరాగల ఫ్లాగ్‌ఫిప్ ఫోన్‌పై శాశ్వత ధర తగ్గింపు..

OnePlus PriceCut: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 32MP AI సెల్ఫీ కెమెరాగల ఫ్లాగ్‌ఫిప్ ఫోన్‌పై శాశ్వత ధర తగ్గింపు..
Advertisement

OnePlus 13s PriceCut| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 13s ధరను భారతదేశంలో శాశ్వతంగా తగ్గించింది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.54,999 నుంచి ఇప్పుడు రూ.50,999కి తగ్గింది. అంటే రూ.4,000 డైరెక్ట్ డిస్కౌంట్ అవుతుంది. అమెజాన్ ఇండియా, OnePlus అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధర అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గుతుంది. నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాంపాక్ట్ సైజులో ఫ్లాగ్‌షిప్ పెర్ఫామెన్స్ కావాలనుకునేవారికి ఈ ఫోన్ మంచి వ్యాల్యూ ఆప్షన్.

డిస్‌ప్లే, డిజైన్

వన్‌ప్లస్ 13sలో 6.32 ఇంచ్ ProXDR LTPO OLED డిస్‌ప్లే ఉంది. 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి. పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్ వరకు ఉంది. ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. స్లిమ్ బెజెల్స్‌తో ప్రీమియం లుక్ ఇస్తుంది. కాంపాక్ట్ డిజైన్ వల్ల ఒక చేత్తో సులభంగా ఉపయోగించవచ్చు.

కెమెరా పెర్ఫామెన్స్

Advertisement

డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP Sony LYT-700 సెన్సార్‌తో ఉంది. షార్ప్ ఇమేజెస్, నేచురల్ కలర్లు ఇస్తుంది. 50MP టెలిఫోటో కెమెరా 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రెయిట్ ఫోటోలు డీటెయిల్డ్‌గా వస్తాయి. ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. AI బ్యూటిఫికేషన్, HDR మోడ్ సపోర్ట్ ఉన్నాయి. వివిధ లైటింగ్‌లో సెల్ఫీలు బాగుంటాయి. ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్‌కు అద్భుతంగా పనిచేస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

6000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒక రోజు పూర్తిగా లాస్ట్ అవుతుంది. హెవీ యూజర్లకు కూడా మంచి బ్యాకప్ ఇస్తుంది. 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 30 నిమిషాల్లో సుమారు 60 శాతం ఛార్జ్ అవుతుంది. చిన్న బ్రేక్‌లలో త్వరగా రీఛార్జ్ చేయవచ్చు.

సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు

Advertisement

లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో OxygenOS రన్ అవుతుంది. ఇంటర్‌ఫేస్ క్లీన్‌గా, స్మూత్‌గా ఉంటుంది. ఎన్నో ఉపయోగకరమైన AI టూల్స్ ఉన్నాయి. AI ట్రాన్స్‌లేట్ ఫీచర్‌లో రియల్-టైమ్‌లో భాషా అనువాదం చేస్తుంది. AI VoiceScribe మీటింగ్స్‌లో నోట్స్ తయారు చేస్తుంది. AI Detail Boost ఫోటోల క్లారిటీ మెరుగుపరుస్తుంది. రోజువారీ పనులు సులభమవుతాయి.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

కొత్త ప్లస్ కీ బటన్

OnePlus 13sలో కొత్త ప్లస్ కీ బటన్ ఉంది. పాత అలర్ట్ స్లైడర్ స్థానంలో ఇది వచ్చింది. ఈ బటన్‌ను కస్టమైజ్ చేయవచ్చు. కెమెరా త్వరగా ఓపెన్ చేయవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఏదైనా యాప్ లాంచ్ చేయవచ్చు. పవర్ యూజర్లకు చాలా సౌకర్యవంతం.

OnePlus 13s ఇప్పుడు కొనడం సరైనదేనా?

OnePlus 13s ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరలో ఇస్తుంది. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునేవారికి బాగుంటుంది. బలమైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మంచి కెమెరా ఉన్నాయి. AI ఫీచర్లు స్మార్ట్‌గా పనిచేస్తాయి. ధర తగ్గడంతో రూ.51,000 కంటే తక్కువలో అద్భుతమైన ఆప్షన్‌గా మారింది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×