E-Paper
Advertisement

క్రేజీ కదిలే ఫ్యాన్.. ఎక్కడికెళ్లినా చల్లగాలి మీ వెంటే.. చుక్క చెమట పట్టనివ్వదు!

క్రేజీ కదిలే ఫ్యాన్.. ఎక్కడికెళ్లినా చల్లగాలి మీ వెంటే.. చుక్క చెమట పట్టనివ్వదు!
Advertisement

Rechargeable Fan: ఇంట్లో ఏసీలు, కూలర్లు, పెద్ద పెద్ద సీలింగ్ ఫ్యాన్లు ఎన్ని ఉన్నా… కొన్నిసార్లు మనకు మాత్రమే ప్రత్యేకంగా కాస్త గాలి కావాలనిపిస్తుంది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు, వంటింట్లో వంట చేసేటప్పుడు లేదా కరెంట్ పోయినప్పుడు ఆ ఇబ్బంది మరింత స్పష్టంగా తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటి అవసరాల కోసమే మార్కెట్లోకి వచ్చింది ‘నూక్ లిట్ వి3’ (Nuuk Lit V3) రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్. ఇది కేవలం గాలిని ఇవ్వడమే కాకుండా, మల్టీపర్పస్ గ్యాడ్జెట్‌గా మారిన ఈ ఫ్యాన్ ప్రధాన ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పవర్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్

ఈ ఫ్యాన్ పవర్ బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంది. ఇందులో అమర్చిన హై-కెపాసిటీ రీఛార్జ్ బుల్ బ్యాటరీ వల్ల ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. గంటల తరబడి నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. పవర్ కట్ అయినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లంతా చల్లటి గాలిని అందిస్తుందని పేర్కొన్నాయి.

తక్కువ శబ్దంతో ఎక్కువ గాలి

Advertisement

సాధారణంగా పోర్టబుల్ ఫ్యాన్లు ఎక్కువ శబ్దం చేస్తుంటాయి. కానీ Nuuk Lit V3 లో అత్యాధునిక బ్రష్‌లెస్ డీసీ (BLDC) మోటార్‌ను ఉపయోగించారు. దీనివల్ల ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎలాంటి శబ్దాలు రావు. దీంతో రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్రకు కూడా ఇది సహకరిస్తుంది.

3-ఇన్-1 మల్టీఫంక్షనాలిటీ

ఈ గ్యాడ్జెట్‌ను కేవలం ఫ్యాన్‌గా మాత్రమే కాకుండా మరెన్నో రకాలుగా వాడుకోవచ్చని కంపెనీ వర్గాలు సూచిస్తున్నారు. పవర్ పోయినప్పుడు గదిలో వెలుతురు కోసం ఇందులో బ్రైట్ ఎల్‌ఈడీ లైట్‌ను ఇచ్చారు. అలాగే అత్యవసర సమయాల్లో మీ మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లను ఛార్జ్ చేసుకోవడానికి ఇది పవర్ బ్యాంక్‌లా కూడా పనిచేస్తుంది. అలాగే
వినియోగదారుల సౌకర్యార్థం ఇందులో వేర్వేరు స్పీడ్ మోడ్స్ (Low, Medium, High) ఇచ్చారు. వాతావరణాన్ని బట్టి మనకు నచ్చిన వేగాన్ని సెట్ చేసుకోవచ్చు.

ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!

Advertisement

ఈ ఫ్యాన్ చాలా తక్కువ బరువుతో స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంది. కాబట్టి ఇంట్లోనే కాకుండా ఆఫీస్ డెస్క్ మీద, కిచెన్‌లో వంట చేసేటప్పుడు, అవుట్‌డోర్ క్యాంపింగ్, ప్రయాణాలకు వెళ్లేటప్పుడు కూడా దీనిని సులభంగా చేత్తో పట్టుకుని తీసుకెళ్లవచ్చు.

Also Read: ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్‌లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!

టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్

పాతకాలపు ఛార్జర్ల లాగా కాకుండా.. దీనికి ఆధునిక Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దీనివల్ల మీ మొబైల్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ సహాయంతోనే దీనిని చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ఫ్యాన్ ను మార్కెట్లో సుమారు రూ.2,999కి విక్రయిస్తున్నారు.

Also Read: BSNLకు హైకోర్టు బిగ్ షాక్.. ఏకంగా రూ.55 లక్షల జరిమానా.. అసలేం జరిగిందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×