E-Paper
Advertisement

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం, బుధవారం పలు జిల్లాల్లో

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం, బుధవారం పలు జిల్లాల్లో
Advertisement

Weather News: ఎట్టకేలకు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీని కారణంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముంది.

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. నేడు-రేపు వర్ష సూచన

Advertisement

నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం వరకు వేసవి తాపంతో అల్లాడతున్న ప్రజలకు బిగ్ రిలీఫ్. నైరుతి రుతుపవనాలు జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా తెలంగాణలోని ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో గద్వాల, దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది.

ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు గంటల్లోని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

Advertisement

సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం

వాటిలో సిద్దిపేట, జనగాం, హన్మకొండ, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ మెదక్, యాదాద్రి -భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశముంది.

15 నుంచి 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశముందని తెలిపింది. ఇక హైదరాబాద్ సిటీ పరిధిలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని వెల్లడించింది. ఇక ఏపీ విషయానికి వద్దాం. రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్రలోని భారీ వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ALSO READ: జగిత్యాలలో మారిన పొలిటికల్ సీన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జీవన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

ముఖ్యంగా విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఆ సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండవద్దని అప్రమత్తం చేసింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×