E-Paper
Advertisement

Agentic AI Phone: స్వయంగా పనులన్నీ చేసే ఏజెంటిక్ AI ఫోన్ లాంచ్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

Agentic AI Phone: స్వయంగా పనులన్నీ చేసే ఏజెంటిక్ AI ఫోన్ లాంచ్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు
Advertisement

Agentic AI Phone Nubia M153 | ప్రపంచంలోనే మొట్టమొదటి “ఏజెంటిక్ AI స్మార్ట్‌ఫోన్” వచ్చేసింది. ఈ ఫోన్ లాంచ్ చేసిన చైనా టెక్ ప్రపంచానికి షాక్ చేసింది. దీని పేరు నూబియా M153 (Nubia M153). ఇది మామూలు వాయిస్ అసిస్టెంట్ ఫోన్ కాదు.. పూర్తి AI పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. మీరు మాట్లాడితే చాలు, టచ్ చేయకుండానే అన్ని పనులు దానంతట దానే చేసేస్తుంది. ZTE టెక్ కంపెనీతో భాగస్వామ్యంలో టిక్‌టాక్ మాతృక కంపెనీ బైట్ డాన్స్ (ByteDance) కలిసి ఈ ఫోన్ తయారు చేసింది.

ఈ ఫోన్ ఎలా పని చేస్తుంది?

ఈ ఫోన్‌ Doubao AI మోడల్ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ ఫోన్ స్క్రీన్ చదవగలదు, టైప్ చేయగలదు, క్లిక్ చేయగలదు. మీరు ఏ పని చెప్పినా మల్టీ-స్టెప్ టాస్క్‌లు ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తుంది. దీనికి సహాయం చేసే మరో AI Nebula-GUI కూడా ఉంది. ఇది స్క్రీన్‌పై నేరుగా పని చేస్తుంది.

రోజువారీ పనులు ఎలా చేస్తుంది?

Advertisement

“ఆకలేసింది” అంటే ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టేస్తుంది. ఏదైనా లాడ్జింగ్ కోసం హోటల్ కావాలి మీతో పాటు మీ పెంపుడు కుక్కు కూడా ఉంది అని సమాచారం ఇస్తే.. హోటల్ ఫోటో తీసి “కుక్కతో రూమ్ బుక్ చేయి” అంటే హోటల్ పేరు గుర్తించి, అక్కడ పెట్ పాలసీ (పెంపుడు జంతువుల పాలసీ) చెక్ చేసి, డేట్స్ సెలెక్ట్ చేసి బుకింగ్ పూర్తి చేస్తుంది. టాక్సీ బుక్ చేయడం, వెకేషన్ ప్లాన్ చేయడం. ఇలాంటివన్నీ ఒక్క మాటలోనే జరిగిపోతాయి!

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి?

నూబియా M153లో 6.78 అంగుళాల LTPO ఆమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది.
పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. మల్టీ టాస్కులు అన్నీ స్మూత్ గా రన్ అవుతాయి.
ఫోన్‌లో 16GB RAM ఉండడంతో స్పీడ్ బాగుంటుంది.
వెనుకవైపు మూడు 50MP కెమెరాలు (మెయిన్ + అల్ట్రావైడ్ + 2.5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో)
సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా
పెద్ద 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ + 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంది.

ఎక్కడ దొరుకుతుంది?

Advertisement

ఈ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. ఇప్పటికి చైనాలోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో బయటి దేశాలకు వచ్చే అవకాశం ఉంది.

ఇది ఎందుకు భవిష్యత్ ఫోన్?

ఇప్పటివరకు ఫోన్ మనం చెప్పినదే చేసేది. కానీ Nubia M153 మనకోసం ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, పనులు పూర్తి చేస్తుంది. ఇది నిజమైన “స్మార్ట్” ఫోన్ – టచ్ లేకుండానే మీ పర్సనల్ సెక్రటరీలా పని చేస్తుంది. చైనా AI రంగంలో ముందంజలో ఉందని ఈ ఫోన్ మరోసారి నిరూపిస్తోంది!

ఇకపై స్మార్ట్ ఫోన్ మీ చేతుల అవసరం లేకుండానే పని చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నూబియా M153 దానికి తొలి అడుగు!

Also Read: 40 లక్షల కంప్యూటర్లు హ్యాక్.. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌తో ప్రమాదం.. ఈ జగ్రత్తలు పాటించండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×