E-Paper
Advertisement

నథింగ్ నుంచి అత్యంత చౌకైన ఫోన్.. ఆ లుక్ చూసి టెక్ ప్రియులంతా ఫిదా, లాంచ్ ఎప్పుడంటే?

నథింగ్ నుంచి అత్యంత చౌకైన ఫోన్.. ఆ లుక్ చూసి టెక్ ప్రియులంతా ఫిదా, లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Nothing Phone 4b: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన స్టైలిష్ లుక్‌తో గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ సంస్థ.. బడ్జెట్ ప్రియుల కోసం సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. Nothing Phone 4b పేరుతో సరికొత్త బి-సిరీస్‌ను భారత మార్కెట్లో జూలై 7న మధ్యాహ్నం 3:30 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘ఎ’ సిరీస్ కంటే తక్కువ ధరలోనే ఇది లభించనుంది. లాంచ్ అయిన వెంటనే ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అమ్మకానికి రానుంది.

కొత్తగా ‘బి’ సిరీస్ ఎందుకంటే?

సాధారణంగా నథింగ్ ఫోన్లు కాస్త ప్రీమియం ధరల్లో ఉంటాయి. అయితే, డిజైన్‌ను ఇష్టపడి కూడా బడ్జెట్ పరిమితుల వల్ల కొనుగోలు చేయలేకపోతున్న వారిని ఆకట్టుకోవడానికే కంపెనీ ఈ సరికొత్త ‘బి’ సిరీస్‌ను ప్రవేశపెడుతోంది. ఇకపై నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చే ఫోన్లలో ఇదే అత్యంత చౌకైన సిరీస్‌గా మారనుంది. నథింగ్ ఇండియా కో-ఫౌండర్ అకిస్ ఇవాంజెలిడిస్ తెలిపిన వివరాల ప్రకారం.. నథింగ్ ఫోన్లలో నెంబర్లు జనరేషన్‌ను సూచిస్తే.. ఆల్ఫాబెట్స్ వాటి ధర, ఫీచర్ల కేటగిరీని తెలియజేస్తాయి. ఆ రకంగా చూస్తే ‘ఎ’ సిరీస్ కంటే ‘బి’ సిరీస్ కాస్త తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: 4G స్లో నెట్‌తో విసిగిపోయారా? ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే ఇంటర్నెట్ రాకెట్‌లా దూసుకెళ్తుంది!

తక్కువ ధరలోనూ అదరగొట్టే డిజైన్:

ధర తగ్గించినప్పటికీ నథింగ్ తమ సిగ్నేచర్ స్టైల్‌ను ఎక్కడా వదులుకోలేదు. కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం.. ఈ ఫోన్ వెనుక భాగం కూడా ఎప్పటిలాగే ట్రాన్స్‌పరెంట్‌ (పారదర్శక) డిజైన్‌తో రానుంది. లోపల ఉండే స్క్రూలు, ఇతర విభాగాలు స్పష్టంగా కనిపిస్తూ నథింగ్ పాత మోడళ్లను గుర్తు చేస్తాయి. అలాగే వెనుక వైపు పిల్-షేప్డ్ కెమెరా సెటప్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు ఫోన్ మెరుపులను పెంచే గ్లిఫ్ తరహా లైట్ బార్‌ను కూడా ఇందులో అందించారు. ఫ్లాట్ ఫ్రేమ్, గుండ్రటి మూలలతో పట్టుకోవడానికి ఈ ఫోన్ చాలా లగ్జరీగా అనిపిస్తుంది.

అంచనా ధర, ఫీచర్లు:

Advertisement

నథింగ్ ఫోన్ 4బి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించినప్పటికీ.. ఇది మల్టిపుల్ RAM, స్టోరేజ్ వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. నథింగ్ ఫోన్ 4ఎ ఫీచర్లలో చాలా వరకు ఇందులోనూ ఉండే అవకాశం ఉంది. మార్కెట్ అంచనాల ప్రకారం.. ఈ సరికొత్త 4బి ఫోన్ ధర, 4ఎ మోడల్ కంటే దాదాపు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే సుమారు రూ.27,000 నుంచి రూ.29,000 బడ్జెట్ పరిధిలో ఇది లభించవచ్చు.

Also Read: గేమర్ల కోసం పవర్‌ఫుల్ టాబ్లెట్.. 185Hz డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో వస్తోన్న RedMagic 5 Pro!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×