E-Paper
Advertisement

BSNL బంపరాఫర్.. కేవలం రూ.259కే.. అపరిమిత వై-ఫై కనెక్షన్!

BSNL బంపరాఫర్.. కేవలం రూ.259కే.. అపరిమిత వై-ఫై కనెక్షన్!
Advertisement

BSNL Broadband Plan: నేటి ఆధునిక కాలంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారింది. అయితే, పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ డిజిటల్ వ్యత్యాసాన్ని తొలగించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL), భారత్‌నెట్ (BharatNet) సంయుక్తంగా ఒక అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వ ‘డిజిటల్ భారత్ నిధి’ (Digital Bharat Nidhi) సపోర్టుతో రూ.259 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 259కే ఎంట్రీ ప్లాన్

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ను చేరవేయాలన్న లక్ష్యంతో ఈ ‘రూరల్ ఎంట్రీ ప్లాన్’ (Rural Entry Plan) ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. కేవలం నెలకు రూ. 259తోనే అపరిమితమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను పల్లె వాసులు సొంతం చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రతి సామాన్య కుటుంబానికి సైతం ఆర్థికంగా భారం కాకుండా ఉండేలా ఈ ధరను నిర్ణయించినట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి.

Advertisement

ఉచిత ఇన్‌స్టాలేషన్

సాధారణంగా కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలంటే మోడెమ్, ఇన్‌స్టాలేషన్ ఛార్జీల రూపంలో భారీగా ఖర్చు అవుతుంది. కానీ బీఎస్ఎన్ఎల్ అలాంటి ఖర్చులేవి లేకుండా ఫ్రీగా ఇన్ స్టాలేషన్ చేయనున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇన్ స్టాలేషన్ ఛార్జీల భారం నుంచి యూజర్లకు ఉపశమనం లభించనుంది.

రూ.259 ప్లాన్ బెనిఫిట్స్..

Advertisement

రూరల్ ఎంట్రీ బ్రాడ్ బాండ్ ప్లాన్ కింద.. యూజర్లకు 25 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఇందులో 700 GB వరకు పూర్తి వేగంతో డేటా లభిస్తుంది. ఒకవేళ ఈ లిమిట్ దాటినా కూడా 2 Mbps వేగంతో ఇంటర్నెట్ నిరంతరాయంగా కొనసాగనుంది. అంతేకాకుండా అపరిమిత కాల్స్, వేవ్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. లో చూడవచ్చు.

Also Read: భోగాపురం విమానశ్రయం.. ఇది చాలా కాస్ట్‌లీ గురూ.. ప్రయాణికులకు చుక్కలే!

కనెక్షన్ ఎలా పొందాలి?

ఈ సరికొత్త రూరల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ ను పలుమార్గాల్లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ www.bsnl.co.in సందర్శించవచ్చు. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-4444కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి ‘బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గోల్డెన్ ఛాన్స్ ను పల్లెవాసులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.

Also Read: రేవంత్ సర్కార్‌పై రాంచందర్ రావు నిప్పులు.. ‘జాబ్ క్యాలెండర్’ ఎక్కడంటూ ప్రశ్నల వర్షం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×