E-Paper
Advertisement

512GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16.. Nothing Phone 3పై ఊహించని రేంజ్‌లో ధర తగ్గింపు!

512GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16.. Nothing Phone 3పై ఊహించని రేంజ్‌లో ధర తగ్గింపు!
Advertisement

Nothing Phone 3 Price Drop: సాధారణంగా భారత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ ధరలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కష్టం. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ‘నథింగ్ ఫోన్ 3’పై ఊహించని రేంజ్‌లో ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు మిడ్‌రేంజ్ ధరలోనే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ స్టోరేజ్ ఆశించే వారి కోసం 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్‌పై ఈ డీల్ లైవ్‌లో ఉంది.

బ్యాంక్ ఆఫర్‌తో భారీగా తగ్గిన ధర:

ఫ్లిప్‌కార్ట్‌లో సాధారణంగా ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఏకంగా రూ.18వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.41,999కి దిగివస్తుంది. ఒకవేళ ఈ బ్యాంక్ కార్డ్ లేకపోయినా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.15,200 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే నెలకు రూ.1,477 ప్రారంభ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బేస్ వేరియంట్లు స్టాక్ అయిపోవడంతో, ఈ హై-ఎండ్ మోడల్‌కే డిమాండ్ విపరీతంగా పెరిగింది.

ఆకట్టుకునే డిజైన్, డిస్‌ప్లే:

Advertisement

నథింగ్ బ్రాండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దాని వెనుక ఉండే ట్రాన్స్‌పారెంట్ డిజైన్. ఈ ఫోన్‌లో కూడా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాల్స్, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఈ లైట్లు వెలుగుతాయి. ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. దీనిలో 6.7 ఇంచుల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల ఫోన్ వాడుతున్నప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి.

Also Read: ఫోల్డబుల్ ఫోన్ల రూట్ మార్చిన శాంసంగ్.. ఈసారి రాబోతున్న 3 కొత్త మోడల్స్ ఇవే!

అదిరిపోయే పర్ఫార్మెన్స్, కెమెరా:

Advertisement

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. దీనివల్ల హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా ఈజీగా అవుతుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50MP కెమెరాలు ఉన్నాయి. ఇవి మంచి డీటెయిలింగ్‌తో కూడిన ఫొటోలను అందిస్తాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ఇక ఎక్కువ సమయం ఛార్జింగ్ బ్యాకప్ ఇచ్చేందుకు 5,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.0 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

గట్టి పోటీ ఇస్తున్న నథింగ్:

ఈ భారీ ధర తగ్గింపుతో నథింగ్ ఫోన్ 3 ప్రీమియం మార్కెట్లో వన్‌ప్లస్, శాంం‌సంగ్ లాంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తోంది. ఫీచర్ల పరంగా రాజీ పడకుండా, తక్కువ ధరలోనే లభిస్తుండటంతో జనాలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్టాక్ పరిమితంగా ఉండటం వల్ల ఈ ఆఫర్ ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. కాబట్టి.. మంచి ప్రీమియం ఫోన్ కోసం చూసేవారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు.

Also Read: షాకింగ్ ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధరలు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×