E-Paper
Advertisement

అబ్బా ఏం స్క్రీన్ సామీ.. 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌, 8560mAh బ్యాటరీతో Honor X70 Pro Max లాంచ్!

అబ్బా ఏం స్క్రీన్ సామీ.. 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌, 8560mAh బ్యాటరీతో Honor X70 Pro Max లాంచ్!
Advertisement

Honor X70 Pro Max: ప్రముఖ చైనా బ్రాండ్ హానర్ తమ X సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌ను చైనా మార్కెట్లో సైలెంట్‌గా లాంచ్ చేసింది. Honor X70 Pro Max పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ లైనప్‌లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ X70, X70I మోడళ్లకు అదనంగా ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్, అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం,

కలర్ ఆప్షన్స్ ఇవే:

చైనాలో ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధరను రూ..28,000గా నిర్ణయించారు. అలాగే 512GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.33,600గా ఉంది. ఇది ఫాంటమ్ పర్పుల్, సన్‌బర్స్ట్ గోల్డ్, బాంబూ గ్రీన్, ఫాంటమ్ నైట్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదలవుతుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

డిస్‌ప్లే ప్రత్యేకతలు:

Advertisement

ఈ ఫోన్‌లో 6.79 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది ఏకంగా 6,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేయడం విశేషం. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వినియోగదారుల కంటి రక్షణ కోసం ఇందులో ఏఐ డిఫోకస్ ఐ ప్రొటెక్షన్, నేచురల్ లైట్ ప్రొటెక్షన్, ఏఐ స్లీప్ ఎయిడ్, అల్ట్రా డార్క్ మోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10.0 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

Also Read: గుట్టు చప్పుడు కాకుండా లీకైన గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆ 3 వాచ్‌లు ఉన్నవారికి లక్కే!

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఎన్‌హాన్స్‌డ్ ఎడిషన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 810 జీపీయూను అమర్చారు. ఫోన్ వెనుక భాగంలో ఈఐఎస్ సపోర్ట్, 4K వీడియో రికార్డింగ్ సదుపాయం గల 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇది 10x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 8MP కెమెరాను అందించారు.

భారీ బ్యాటరీ, అదనపు ఫీచర్లు:

ఈ Honor X70 Pro Max ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. దీనిలో ఏకంగా 8,560mAh సామర్థ్యం గల ‘చింగ్‌హై లేక్’ లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాదు.. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: 512GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16.. Nothing Phone 3పై ఊహించని రేంజ్‌లో ధర తగ్గింపు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×