E-Paper
Advertisement

Nothing Phone 2a: మరో రెండు కొత్త కలర్‌లలో నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేస్తోంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

Nothing Phone 2a: మరో రెండు కొత్త కలర్‌లలో నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేస్తోంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
Advertisement

Nothing Phone 2a New Colours: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ ఫోన్‌ కంపెనీ మొబైళ్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. అందులో నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్ ముందు వరుసలో ఉంది. ఈ Nothing Phone 2a ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ఈ ఏడాది మార్చి 5న Black and White రెండు కలర్ ఆప్షన్లతో ఆవిష్కరించబడింది. కంపెనీ ఏప్రిల్‌లో భారతదేశంలో మూడవ కలర్‌గా ‘బ్లూ’ కలర్‌ వేరియంట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది.

అయితే కంపెనీ ఇప్పుడు ఫోన్ 2aని కొత్త రంగుల్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రమోషనల్ టీజర్ కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇది కొత్త రంగు ఎంపికలను భారతదేశంలో త్వరలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభించనున్నట్లు సూచిస్తుంది. ఇందుకు సంబంధించి కంపెనీ తన ట్విట్టర్ ఎక్స్ (X)లో పోస్ట్ పెట్టింది.

Advertisement

అందులో రెడ్, ఎల్లో, బ్లూ అనే మూడు రంగులు కనిపిస్తున్నాయి. అయితే వీటికి అర్థం ఏంటో కంపెనీ వెల్లడించలేదు. కానీ global Nothing X ప్రొఫైల్, Nothing India ప్రొఫైల్ రెండూ తమ డిస్‌ప్లే చిత్రాలను పసుపు, ఎరుపు, నలుపు డాట్స్‌తో ‘NOTHING (R)’ అని చూపించబడ్డాయి. దీని ప్రకారం.. నథింగ్ ఫోన్ 2a బ్లాక్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. హ్యాండ్‌సెట్ కోసం బ్లూ కలర్ ఎంపిక భారతదేశంలో అందుబాటులో ఉంది.

Also Read: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

Advertisement

అందువల్ల ఫోన్ త్వరలో రెడ్, ఎల్లో కలర్‌లలో లేదా రెండు కలర్‌లను మిక్స్ చేసి కొత్త కలర్ వేరియంట్‌లో రావచ్చని అంటున్నారు. అధికారిక టీజర్‌లలో నథింగ్ ఫోన్ 2a పేరును ఎన్నడూ ప్రస్తావించనప్పటికీ.. FoneArena ద్వారా గుర్తించబడిన Flipkart టీజర్ ఫోన్ 2a కొత్త కలర్ వేరియంట్‌లను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

నథింగ్ ఫోన్ 2a కొత్త కలర్ వేరియంట్‌లు జూలైలో విడుదల కానున్న నథింగ్ ఫోన్ 2a కమ్యూనిటీ ఎడిషన్‌కు భిన్నంగా ఉంటాయని సమాచారం. అయితే వీటి ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం నథింగ్ ఫోన్ 2a భారతదేశంలో 8GB + 128GB ధర రూ.23,999, 8GB + 256GB ధర రూ.25,999, 12GB + 256GB వేరియంట్ రూ.27,999 ధరలో అందుబాటులో ఉంది. ఇవి వరుసగా వైట్, బ్లూ, బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×