E-Paper
Advertisement

Nokia Lumino X1 smartphone: నోకియా లుమినో ఎక్స్ వన్ 5 జీ విడుదల.. మార్కెట్‌లోకి కొత్త పోటీదారు ఎంట్రీ

Nokia Lumino X1 smartphone: నోకియా లుమినో ఎక్స్ వన్ 5 జీ విడుదల.. మార్కెట్‌లోకి కొత్త పోటీదారు ఎంట్రీ
Advertisement

Nokia Lumino X1 smartphone: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఒకప్పుడు నోకియా అంటే నమ్మకం. ఎన్నో సంవత్సరాలు నిలిచే బ్రాండ్ అనే గుర్తింపు కూడా నోకియా సంపాదించుకుంది. కానీ,కాలం మారడంతో ఆ స్థానానికి నోకియా కొంత దూరమైంది. అయితే మళ్లీ ఆ స్థాయిని తిరిగి సంపాదించాలనే లక్ష్యంతో నోకియా చేసిన ప్రయత్నానికి ఇప్పుడు స్పష్టమైన ఫలితం కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా విడుదలైన నోకియా లుమినో ఎక్స్1 5జీ చూసిన తర్వాత, ఇది సాధారణంగా లాంచ్ కాదు, నోకియా రీఎంట్రీ అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ను ఆధిపత్యం చెలాయిస్తున్న పెద్ద కంపెనీలకు ఇది నేరుగా ఇచ్చిన సవాలు. ఈ లాంచ్‌తో వినియోగదారుల దృష్టి మరలా నోకియా వైపే తిరిగింది.

క్లాస్‌ డిజైన్

Advertisement

నోకియా లుమినో ఎక్స్1 5జిని చేతిలోకి తీసుకున్న క్షణం నుంచే దీని డిజైన్ క్లాస్‌ను ఫీలవుతారు. స్టైల్, కమ్ఫర్ట్, బిల్డ్ స్ట్రాంగ్ ఇవన్నీ కలిసి ఈ ఫోన్ మొత్తం ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. పెద్ద డిస్‌ప్లే కావడంతో కనిపించే విజువల్స్ కూడా సినిమాటిక్‌గా కనిపిస్తాయి.

144 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్

Advertisement

ఈ ఫోన్‌లో 6.9 అంగులాల క్యూహెచ్‌డి ప్లస్ అమోలేడ్ డిస్‌ప్లే ఉంది. వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా, సోషల్ మీడియా స్క్రోలు చేసినా, ప్రతి ఫ్రేమ్ స్మూత్‌గా కళ్ల ముందే లైవ్‌గా కనిపిస్తుంది. 144 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోల్ చేయడమే ఒక అనుభవం అయిపోతుంది. ముఖ్యంగా బయట ఎండలో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ లైటింగ్ తగ్గకుండా క్లియర్‌గా కనిపించేందుకు 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది.

8500 mAh బ్యాటరీ

ఈ ఫోన్‌లో అతిపెద్ద శక్తి బ్యాటరీ. ఎందుకంటే 8500 mAh బ్యాటరీ అంటే సాధారణ యూజ్‌లో రెండురోజులు కూడా బెంగ లేకుండా నడుస్తుంది. వీడియో చూస్తూ, గేమ్స్ ఆడుతూ ఉండగా ఛార్జ్ అయిపోతుందేమో అని ఇబ్బంది ఉండదు. అంతేకాదు ఛార్జింగ్ వేగం కూడా ఎంత అంటారా 210 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అంటే కొద్ది నిమిషాల్లోనే పవర్ పూర్తిగా రీఫిల్ అవుతుంది. దీని తో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండటం వల్ల మరో ఫోన్‌కి లేదా వైర్లెస్ ఇయర్‌బడ్స్‌కి కూడా పవర్ ఇవ్వచ్చు.

Also Read: Redmi Premium 5G Phone: గేమింగ్ బీస్ట్ వచ్చేసింది.. 200ఎంపి కెమెరాతో రెడ్‌మి కొత్త ఫోన్ లాంచ్ డీటెయిల్స్

డిమెంసిటీ 9200 అల్ట్రా ప్రాసెసర్

పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే, నోకియా ఈసారి అసలు కాంప్రమైజ్ కాలేదు. ఈ లుమినో ఎక్స్1 5జిలో డిమెంసిటీ 9200 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించారు. అంటే స్పీడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, 4కే వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ ఏ పని చేసినా ఫోన్ స్లో అవ్వదు. రియల్ టైంలో అప్లికేషన్లు మారుస్తున్నా, పెద్ద ఫైల్స్ ఓపెన్ చేస్తున్నా, పర్‌ఫార్మెన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. స్టోరేజ్ ఆప్షన్స్ చూసినా ఇది స్పష్టమవుతుంది—12 జీబీ + 256 జీబీ, 16 జీబీ + 512 జీబీ, 24 జీబీ + 1 టీబీ వంటి భారీ వేరియంట్స్ రావడం అంటే ఇది పూర్తి విధంగా పవర్ యూజర్ల కోసం రూపొందించిన ఫోన్.

ఎఐ కెమెరా టెక్నాలజీ

కెమెరా గురించి మాట్లాడకపోతే పూర్తి కాదు. నోకియా కెమెరా క్వాలిటీ పాత కాలం నుంచే ప్రత్యేకం. ఈ ఫోన్‌లో కూడా ఎఐ కెమెరా టెక్నాలజీ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. నైట్ ఫోటోలు తీయడం, జూమ్ చేసినప్పుడు డీటైల్ కోల్పోకుండా క్వాలిటీ రావడం, వీడియో స్టెబిలైజేషన్ ఉండటం ఇవన్నీ సోషల్ మీడియా కోసం కంటెంట్ చేసే వారికి బంగారం లాంటివి. ఒక ఫోన్‌తోనే సినిమాటిక్ వీడియోలను తీసుకోవచ్చు.

సేఫ్టీ, డ్యూరబిలిటీ.. IP68 రేటింగ్

సేఫ్టీ డ్యూరబిలిటీ (మన్నిక) విషయాల్లో నోకియా పేరు ఎప్పుడూ ముందే ఉంటుంది. లుమినో ఎక్స్1 5జిలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉపయోగించారు కాబట్టి స్క్రీన్ దెబ్బతినే ఛాన్స్ చాలా తక్కువ. ఐపి68 రేటింగ్ ఉన్నది కాబట్టి నీరు, డస్ట్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. కనెక్టివిటీ కోసం 5జి, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి.

ఇండియాలో ధర ఎంతంటే?

ఇక అసలు విషయం ధర. ఈ రేంజ్ స్పెక్స్ ఇచ్చే ఫోన్స్ సాధారణంగా ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో భారీ ధరల్లో అమ్ముతాయి. కానీ నోకియా లుమినో ఎక్స్1 5జి స్టార్టింగ్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. ఈ ధర విన్న వెంటనే టెక్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఇంత పవర్‌ఫుల్ బ్యాటరీ, ఇంత పెద్ద డిస్‌ప్లే, ఇంత స్పీడ్ ప్రాసెసర్ ఈ ధరలో ఎవరూ ఊహించలేదు. ఈ రేంజ్‌లో ఫోన్ కొనాలి అంటే ఇదే సరైన ఆప్షన్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×